Homeఎంటర్టైన్మెంట్Keeravani son marriage with star heroine: కీరవాణి కోడలుగా రానున్న స్టార్ హీరోయిన్... రాజమౌళి,...

Keeravani son marriage with star heroine: కీరవాణి కోడలుగా రానున్న స్టార్ హీరోయిన్… రాజమౌళి, కీరవాణి ఒప్పుకోవడం లేదా..?

Keeravani son marriage with star heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ప్రేమ చిగురించడం అనేది సర్వసాధారణం. ఇప్పటికి చాలామంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా చక్కగా వాళ్ల లైఫ్ ని వాళ్లు లీడ్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కినేని నాగార్జున – అమల, మహేష్ బాబు – నమ్రత రీసెంట్ గా విజయ్ దేవరకొండ – రష్మిక మందాన లాంటి టాప్ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరిని ఆనందింపజేసే విషయమనే చెప్పాలి. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకొని విడిపోయినప్పటికి వీళ్లు మాత్రం చాలా అన్యోన్యమైన దాంపత్యాన్ని గడుపుతున్నారు. ఇక విజయ్ – రష్మిక సైతం ఎలాంటి గొడవలు లేకుండా తమ లైఫ్ ను లీడ్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ప్రయత్నమైతే చేస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే కీరవాణి కొడుకు సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన కాళ భైరవ సైతం ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారట. ఆ హీరోయిన్ సైతం కాలభైరవ ను ప్రేమిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే బలగం సినిమాలో హీరోయిన్ గా నటించిన ‘కావ్య కళ్యాణ్ రామ్’ కావడం విశేషం… వీళ్లిద్దరూ కొద్దిరోజుల నుంచి ప్రేమించుకుంటున్నారట.

Also Read: పాలిటిక్స్ లో దళపతి విజయ్ కంటే రజినీకాంత్ ఇంటెలిజెంటా..?

మరి వీళ్ళ పెళ్లికి అమ్మాయి వాళ్ళ తరపు పెద్దలు ఒప్పుకున్నప్పటికి రాజమౌళి కీరవాణి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదట. కారణమేంటంటే కాలభైరవకి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు వేరే ఒక సంబంధాన్ని చూశారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా కాల భైరవ ఇప్పుడు తన డిసిజన్ ని ఎలా మార్చుకోబోతున్నాడు.

కావ్య కళ్యాణ్ రామ్ ని పెళ్లి చేసుకుంటాడా? లేదంటే ఫ్యామిలీ వాళ్ళు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ క్రమంలోనే కాల భైరవ కొన్ని సినిమాలకు మ్యూజిక్ ను అందిస్తూ సాంగ్స్ పడుతుంటే, కావ్య కళ్యాణ్ రామ్ మాత్రం హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular