Kannappa Collection Day 9: మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, ఎన్నో కష్టాలను ఎదురుకొని, డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేసింది. ఏంటో అనుకున్నాం కానీ, బాగానే తీశారు, మంచు విష్ణు కూడా నటన అదరగొట్టేసాడు అనే టాక్ వచ్చింది. దానికి తోడు ఈ చిత్రం లో ప్రభాస్, అక్షయ్ కుమార్,మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ ఉండడం తో తన మార్కెట్ కి మించిన భారీ వసూళ్లు వస్తాయని, పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపేస్తుందని మంచు విష్ణు బలమైన నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ఈ చిత్రం కేవలం ఆయన మార్కెట్ రేంజ్ లోనే ఆడింది అని చెప్పాలి.
Also Read: ఇంగ్లాండ్ 600 టార్గెట్ చేజ్ చేస్తుందా.. గత చరిత్ర ఏం చెబుతోందంటే?
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 9 రోజుల్లో 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మంచు విష్ణు రేంజ్ కి ఇది చాలా పెద్ద వసూళ్లే. కానీ ఆయన తన ప్రతీ ఇంటర్వ్యూ లో ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఖర్చు చేశాడంటూ చెప్పుకొచ్చాడు. నిజంగా అంత ఖర్చు చేసాడో లేదో తెలియదు కానీ, చాలా వరకు షూటింగ్ ని న్యూజిల్యాండ్ లోని ఓపెన్ గ్రౌండ్ లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్వాలిటీ కూడా చాలా బాగొచ్చింది. VFX షాట్స్ కూడా చాలానే ఉన్నాయి కానీ, అవి కూడా మంచు విష్ణు చెప్పిన 200 కోట్ల రూపాయిల బడ్జెట్ కి మ్యాచ్ అవ్వడం లేదు. ఒకవేళ మంచు విష్ణు చెప్పిన బడ్జెట్ లెక్కల ప్రకారం అయితే ఈ సినిమా కమర్షియల్ గా భారీ డిజాస్టర్ అనొచ్చు.
అలా కాకుండా కేవలం 30 కోట్ల రూపాయిల రేంజ్ లో బడ్జెట్ ని ఖర్చు చేసి ఉండుంటే ఈ సినిమాని యావరేజ్ గ్రాసర్ గా పరిగణించొచ్చు. ఓవర్ సీస్ లోని నార్త్ అమెరికా లో కూడా ఈ చిత్రానికి హాఫ్ మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మంచు సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది చిన్న విషయం అయితే కాదు. కానీ ఈ సినిమా బడ్జెట్ ఎంతో నిజానిజాలు తెలియాలంటే మంచు విష్ణు కి లై డిటెక్టర్ పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ చిత్రానికి ఇప్పటికీ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. 9వ రోజు ఈ చిత్రానికి 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. బుక్ మై షో యాప్ లో గడిచిన 24 గంటల్లో 12 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. నేడు కూడా ఈ చిత్రానికి మంచు వసూళ్లు నమోదు అవుతున్నాయి.