Hari Hara Veera Mallu Overseas Bookings: ఎన్నో రోజుల నుండి అభిమానులను, ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎట్టకేలకు ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కదా ఈ సినిమా నుండి మేము కోరుకున్న కంటెంట్, ఇక పవర్ స్టార్ ఆడిస్తాడు చూడండి అని అభిమానులు సోషల్ మీడియా లో గర్వంగా తొడలు కొట్టుకోవడం మొదలు పెట్టారు. ముందుగా జూన్ 12 న ఈ సినిమాని విడుదల చెయ్యాలి అనుకున్నప్పుడు ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. అప్పటికీ ఈ సినిమా నుండి ఒక్క సరైన కంటెంట్ కూడా బయటకు రాలేదు. దీంతో సినిమా పై హైప్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు.
Also Read: ఇంగ్లాండ్ 600 టార్గెట్ చేజ్ చేస్తుందా.. గత చరిత్ర ఏం చెబుతోందంటే?
అభిమానుల్లో ఒక్కటే నిరాశ, సోషల్ మీడియా అంతటా పవన్ కళ్యాణ్ దురాభిమానుల నుండి ట్రోల్స్ తో దద్దరిల్లిపోయింది. రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ ని కేవలం నార్త్ అమెరికా నుండి రాబట్టాల్సిన ఈ చిత్రం అంత రేంజ్ కి వెళ్ళలేదేమో అని అందరికీ అనిపించింది. కానీ ట్రైలర్ తర్వాత ఈ సినిమాకు ఉన్న డిమాండ్ వేరు. రీసెంట్ గా విడుదలైన తర్వాత ఈ చిత్రానికి ఏర్పడిన డిమాండ్ వేరు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని జర్మనీ లో మొదలు పెట్టారు. అక్కడ బుకింగ్స్ ప్రారంభం అవ్వగానే ఒక థియేటర్ మొత్తం నిమిషాల వ్యవధిలో హౌస్ ఫుల్ అయ్యింది. మెయిన్ లొకేషన్స్ లో అక్కడ ఇంకా బుకింగ్స్ మొదలు అవ్వలేదు. ఒకవేళ అయితే హాట్ కేక్స్ లాగా టికెట్స్ అమ్ముడుపోయాయని అంటున్నారు.
ఇక నార్త్ అమెరికా లో కూడా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ నెల 10 నుండి పూర్తి స్థాయిలో నార్త్ అమెరికా మొత్తం బుకింగ్స్ ని ప్రారంబిస్తారట. అదే విధంగా ఓవర్సీస్ లోని మిగిలిన ప్రాంతాలు లండన్, ఆస్ట్రేలియా, దుబాయి వంటి ప్రాంతాల్లో కూడా పదవ తేదీనే అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెడుతారట. ఆరోజునే ఈ సినిమా ఓపెనింగ్స్ రేంజ్ ఎంత ఏమిటి అనేది అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈసారి థియేట్రికల్ ట్రైలర్ ముందుగానే రావడంతో కచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్స్ పోయినసారి కంటే బెటర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఈ సినిమా ముందు ఉన్న టార్గెట్ దేవర. ఈ చిత్రానికి మొదటి రోజు ఓవర్సీస్ మొత్తం కలిపి 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ‘హరి హర వీరమల్లు’ కి అంత రేంజ్ ఉందో లేదో చూడాలి.