Kannappa vs Hari Hara Veera Mallu: మాది చాలా పెద్ద సినిమా..మాది పీరియడ్ ఫిలిం..VFX 5 దేశాల్లో చేయించాం, 250 కోట్లు ఖర్చు చేశాం, అందుకే సినిమాని పూర్తి చెయ్యడానికి ఇంత సమయం పట్టింది. ఇదే ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్ర నిర్మాత AM రత్నం ఈ సినిమా విడుదలకు ముందు ప్రతీ ఇంటర్వ్యూ లో, ఈవెంట్ లో చెప్పిన మాట. కానీ సినిమా విడుదల తర్వాత అందులోని VFX చూసిన తర్వాత, పాపం ప్రీమియర్ షోస్ కి ఎంతో ఉత్సాహంతో వెళ్లిన అభిమానులు ముఖం పై నెత్తురు చుక్క లేదు. అంత దారుణంగా ఉన్నాయి అన్నమాట VFX. కేవలం VFX కోసం నిర్మాత AM రత్నం నిజంగా 70 కోట్లు ఖర్చు చేశాడా?, చేసి ఉంటే కచ్చితంగా ఆయనది అమాయకత్వం అనుకోవాలి. ఆయన్ని ఎవరో మోసం చేసి ఉండాలి. లేదా ఆయనే ఆడియన్స్ ని మోసం చేసి ఉండాలి.
Also Read: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఆ లోటు తెలిసిపోతుందా..?
ఈమధ్య కాలం లో విడుదలైన ఏ సినిమాలో కూడా ఇంత దారుణమైన VFX సన్నివేశాలు లేవు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గుర్రపు స్వారీ చేసే ఒకే సన్నివేశాన్ని నాలుగు సందర్భాల్లో సినిమాలో చూపించాడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. చాలా సన్నివేశాలు ఇలాగే ఉంటాయి. 5 దేశాల్లో VFX చేయించాం అని AM రత్నం ఎలా అన్నాడో అసలు అర్థం కావడం లేదు. గత నెలలో విడుదలైన ‘కన్నప్ప’ చిత్రాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఇందులో VFX షాట్స్ మొత్తం ఎవ్వరూ ఊహించని విధంగా చాలా బాగున్నాయి, సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉన్నాయి. అందరూ కన్నప్ప VFX చూసి ఆశ్చర్యపోయారు. ‘హరి హర వీరమల్లు’ VFX కన్నప్ప కి దరిదాపుల్లో కూడా లేదు. సినిమాకి ఈ రేంజ్ నెగటివ్ టాక్ రావడానికి కారణం ఆ VFX నే. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి మధ్య చాలా తేడా ఉంది.
Also Read: హరిహర వీరమల్లు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
ఫస్ట్ హాఫ్ మొత్తం క్రిష్ తెరకెక్కించాడు. ప్రతీ సన్నివేశంలో ఆయన మార్క్ కనిపించింది. క్వాలిటీ కూడా చాలా గ్రాండియర్ గా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో ప్రతీ షాట్ లోనూ ఆ క్వాలిటీ నే మిస్ అయ్యింది. ఇదేంటి స్క్రీన్ లో ఏదైనా తేడా ఉందా?, లేకపోతే VFX అలా ఉందా అని ఆడియన్స్ కి ఒక ఫీలింగ్ కలుగుతుంది. జ్యోతి కృష్ణ కి డైరెక్టర్ గా యావరేజ్ మార్కులు ఇవ్వొచ్చు. కానీ ఒక టెక్నీషియన్ గా మాత్రం ఆయనకు అనుభం లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రీమియర్ షోస్ లో అభిమానులకు అయితే ఈ సినిమా నచ్చలేదు. ఇక నార్మల్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారో చూడాలి.