Kannappa Collection Day 4: మంచు విష్ణు(Manchu Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ అయితే పర్వాలేదు కానీ, కలెక్షన్స్ మాత్రం అనుకున్న స్థాయిలో లేవు. కేవలం ప్రభాస్(Rebel Star Prabhas) ని చూసే ఆడియన్స్ కి థియేటర్స్ కి వీకెండ్ వరకు కదిలినట్టుగా అనిపిస్తుంది. వర్కింగ్ డేస్ మొదలు అవ్వగానే ఈ సినిమా అసలు స్వరూపం బయటపడుతుంది. నిన్న వర్కింగ్ డే అవ్వడం తో తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. ఓవరాల్ గా నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు కలిపి 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 24 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు నుండి ఈ చిత్రానికి కోటి రూపాయిల లోపే షేర్ వసూళ్లు వచ్చేలా కనిస్తుంది.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఇతర బాషల దబ్ వెర్షన్స్ కి కలిపి 3 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా,ఓవర్సీస్ నుండి 2 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ మంచు విష్ణు టీం నాలుగు రోజుల్లో 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి నిజం లేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు. వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ కనీస స్థాయిలో కూడా లేవని, మహా అయితే ఇంకో 10 కోట్ల రూపాయిల షేర్ రావొచ్చేమో కానీ,బ్రేక్ ఈవెన్ కి అవసరం అయ్యేది మాత్రం రాదని అంటున్నారు.
మంచు విష్ణు ఈ చిత్రానికి మొదటి నుండి 200 కోట్ల రూపాయిలు ఖర్చు చేసాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ సినిమా చూస్తే అంత ఖర్చు కనపడలేదు. ఓపెన్ గ్రౌండ్ లోనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్టుగా అనిపించింది. మరో పక్క ప్రభాస్, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ స్పెషల్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే తీసుకొని ఉండుంటాడు. అయినప్పటికీ అంత బడ్జెట్ అయ్యుండదు అని అంటున్నారు విశ్లేషకులు. ఓవరాల్ గా ఈ చిత్రాన్ని ప్రభాస్ సేవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసాడు కానీ, మంచు ఫ్యామిలీ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ చిత్రం కమర్షియల్ డిజాస్టర్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి