3 BHK Movie Collection Day 2: 3 BHK Movie Collection Day 2: కొన్ని చిత్రాలు విడుదలైన విషయం కూడా మనకి తెలియదు. అంత సైలెంట్ గా వస్తాయి, కానీ కమర్షియల్ గా మాత్రం భారీ విజయాలుగా నిలిచి అందరినీ సర్ప్రైజ్ కి గురి చేస్తుంటాయి. ఇలాంటి సందర్భాలు మన ఇండస్ట్రీ లోనే కాదు అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఎన్నో సందర్భాల్లో జరుగుతూ వచ్చింది. రీసెంట్ గానే ప్రముఖ హీరో సిద్దార్థ్(Hero Siddarth) నటించిన 3BHK అనే చిత్రం విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమా పోస్టర్స్ ని చూసి ఈ సిద్దార్థ్ కి ఏమి పని లేదా?, ఎప్పుడూ ఇలాంటి సినిమాలే తీస్తూ ఉంటాడు అని అంతా అనుకున్నారు. కానీ విడుదల తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో మొదటి రోజు 40 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.
Also Read: ఇంగ్లాండ్ 600 టార్గెట్ చేజ్ చేస్తుందా.. గత చరిత్ర ఏం చెబుతోందంటే?
చిన్న సినిమాకి ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోవడం చిన్న విషయం కాదు. ప్రస్తుతానికి బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మొదటి రోజు మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన ఈ సినిమాకు, రెండవ రోజు కూడా అదే రేంజ్ వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ వసూళ్లు పెద్దగా ఊపందుకోలేదు కానీ, తమిళం లో మాత్రం ఈ చిత్రం ఇరగకుమ్మేస్తుంది. తెలుగు లో కూడా సిద్దార్థ్ చాలా బలంగా ప్రమోట్ చేశాడు. కానీ ఆడియన్స్ మాత్రం సిద్దార్థ్ ని నమ్మినట్టుగా అనిపించలేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం రెండు రోజులకు కలిపి ఈ చిత్రానికి ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి.
ఈరోజు కూడా కలెక్షన్స్ స్టడీ గా ఉంటాయి. రేపటి నుండి ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ ని రాబడితే కచ్చితంగా ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. హీరో గా చిన్నా సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని అందుకొని ఫామ్ లోకి వచ్చిన సిద్దార్థ్ , ఈ సినిమాతో మరోసారి కమర్షియల్ గా సూపర్ హిట్ ని అందుకొని అందరినీ సర్ప్రైజ్ కి గురి చేశాడు. ఇలాగే మంచి సినిమాలు చేసుకుంటూ పోతే సిద్దార్థ్ కి ఒకప్పుడు ఉన్న మార్కెట్ తిరిగి వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక 3BHK విషయానికి వస్తే మిడిల్ క్లాస్ ప్రేక్షకులు ప్రతీ ఒక్కరికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు.