Thug Life Kamal Haasan OTT : కమల్ హాసన్(Kamal Haasan), మణిరత్నం(Maniratnam) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘నాయకుడు’ అనే చిత్రం విడుదలై దాదాపుగా 38 సంవత్సరాలు దాటిపోయింది. అప్పట్లో ఈ సినిమా సౌత్ ఇండియా లో సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో రీసెంట్ గానే ‘థగ్ లైఫ్'(Thug Life) అనే చిత్రం తెరకెక్కింది. 38 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉండేవి. కానీ విడుదల తర్వాత ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా మ్యాచ్ చేయలేకపోయింది ఈ చిత్రం. ఫలితంగా మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. బుక్ మై షో వంటి యాప్స్ లో పబ్లిక్ నుండి 5/10 రేటింగ్ వచ్చిదంటే ఎంతటి ఘోరమైన డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ సినిమాకు మొదటి నుండి ఉన్నటువంటి క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ మాత్రం భారీ లెవెల్ లో వచ్చాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లో వంద కోట్ల మార్కుని కూడా దాటుతుంది. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటాలంటే 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. అంతటి వసూళ్లు రావడం అసాధ్యం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని 5 భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ సుమారుగా 150 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం ఈ సినిమాని థియేటర్స్ లో విడుదలైన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయాలి. కానీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ వారం దాటితే థియేట్రికల్ రన్ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Also Read : ‘థగ్ లైఫ్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఓవర్సీస్ లో కలెక్షన్స్ అదిరిపోయాయిగా!
దీంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మాత కమల్ హాసన్ తో నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని అడిగిందట. అందుకు అదనంగా మరింత డబ్బులు చెల్లిస్తామని కూడా చెప్పిందట. దీనికి కమల్ హాసన్ ఒప్పుకోవడంతో నాలుగు వారాలు పూర్తి అయినా వెంటనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో దర్శనం ఇవ్వనుంది. అంటే జులై మొదటి వారం లో మనం ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు అన్నమాట. థియేటర్స్ లో దారుణమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో ఎలాంటి రెస్సాన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి. కొన్ని ఫ్లాప్ సినిమాలకు ఈమధ్య ఓటీటీ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకు బెస్ట్ ఉదాహరణ జాక్. థియేటర్స్ లో ఫ్లాప్ గా నిల్చిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నెల రోజుల నుండి ట్రెండ్ అవుతుంది. ‘థగ్ లైఫ్’ కూడా అలా ట్రెండ్ అవుతుందో లేదో చూద్దాం.