Pawan Kalyan OG Movie Japanese Actor : పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ చిత్రం పై రోజురోజుకు అంచనాలు తార స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. గాథలో పవన్ కళ్యాణ్ జానీ చిత్రానికి ఇంతటి క్రేజ్ ఉండేదట. మళ్ళీ ఇన్నాళ్లకు మరో పవన్ కళ్యాణ్ సినిమాకు ఇలాంటి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు కేవలం ఒక్క చిన్న గ్లింప్స్ వీడియో మాత్రమే విడుదలైంది. ఆ వీడియో కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు రోజుకి ఒక్కసారి అయినా ఆ గ్లింప్స్ వీడియో చూడనిదే నిద్రపోరు అంటే అతిశయోక్తి కాదేమో. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ తనకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని కొన్ని సన్నివేశాలను విజయవాడ లో చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 16 తో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి కానుంది.
ఇదంతా పక్కన పెడితే ఇప్పటికే ఈ సినిమా లో ఒక పాపులర్ జపనీస్ నటుడు నటించాడు. బ్యాంకాక్ లో ఆయనకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. ఇప్పుడు మరో జపనీస్ నటుడు ఈ సినిమాలో భాగం అయ్యాడు. అతని పేరు కెలిచియాందో. రీసెంట్ గానే ఇంస్టాగ్రామ్ లో ఆయన ఒక ఫోటోని అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ అభిమానులు అతనికి సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం లో ఒక వీడియో ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కెలిచియాందో మూవీ కోసం కొన్ని ఫైట్ రిహార్సల్స్ చేస్తూ కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ ఫైట్స్ చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ సినిమాలో పని చేసే జపాన్ నటుడి ఫైట్ సన్నివేశాలే ఈ రేంజ్ లో ఉంటే ఇక పవన్ కళ్యాణ్ వి ఏ రేంజ్ లో ఉంటాయో మీరే ఊహించుకోండి.
ఈ చిత్రం కోసం గా పవన్ కళ్యాణ్ కొన్ని స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకున్నాడు. అపరిచితుడు చిత్రం సెకండ్ హాఫ్ గుండు వాడితో ఒక ఫైట్ ఉంటుంది గుర్తుందా?, ఆ తరహా ఫైట్ ఓజీ చిత్రం లో కూడా ఉంటుందట. సుమారుగా రెండు వారాల పాటు ఆ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించాడట డైరెక్టర్ సుజిత్. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను ఈ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ నెలాఖరుతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తాన్ని ముగించే పనిలో ఉన్నారు మేకర్స్. వచ్చే నెల నుండి నాన్ స్టాప్ గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.
#OG – Keiichiando Japanese actor Keiichi Ando played a brief role in OG, and here's a glimpse of his katana fight rehearsal for the film ️#PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/oX5G8V0eFL
— Telugu Chitraalu (@TeluguChitraalu) June 10, 2025