Thug Life 3rd Day Collection: కమల్ హాసన్(Kamal Haasan), శింబు(Silambarasan TR) ప్రధాన పాత్రలు పోషిస్తూ మణిరత్నం(Maniratnam) దర్శకత్వం లో తెరకెక్కిన ‘థగ్ లైఫ్'(Thug Life) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మణిరత్నం ఇంతటి నీచమైన సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించలేదని, ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా అనే ఫీలింగ్ తో థియేటర్ లో కూర్చున్నామని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కమల్ హాసన్ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఖర్చు విషయం లో మాత్రం ఆయన ఎక్కడా వెనకాడలేదని ఈ సినిమాలోని క్వాలిటీ ని చూస్తే అర్థం అవుతుంది. కానీ ఇంత సిల్లీ స్టోరీ మీద ఆయన అంత ఖర్చు ఎందుకో చేసాడో అర్థం కావడం లేదని కమల్ అభిమానులు సైతం మండిపడుతున్నారు.
అయితే భారీ అంచనాలు ఉండడం వల్ల భారీ ఓపెనింగ్స్ అయితే రాలేదు కానీ, మరీ పరువు తీసే రేంజ్ ఓపెనింగ్ మాత్రం రాలేదు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 38 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా రెండవ రోజు 13 కోట్ల 44 లక్షలు, మూడవ రోజు 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 74 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చేవి. వాస్తవానికి ఏ సినిమాకు ఇంకా ఎక్కువ వసూళ్లు రావాలి. కానీ కమల్ హాసన్ నోటి దూల కారణంగా ఈ చిత్రం కర్ణాటక లో విడుదల అవ్వలేదు. లేకుంటే మొదటి రోజు ఓపెనింగ్ వరల్డ్ వైడ్ గా 45 కోట్ల రూపాయిల వరకు ఉండేది.
ఇకపోతే ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిద్దాం. అన్నీ ప్రాంతాలను పోలిస్తే ఓవర్సీస్ లో ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. తమిళనాడు లో మూడు రోజులకు కలిపి 26 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, ఓవర్సీస్ లో 30 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా,కర్ణాటక లో రెండు కోట్ల రూపాయిలు,హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 65 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. ఫుల్ రన్ లో కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుంది కానీ,కమల్ హాసన్ కెరీర్ లో మాత్రం ‘ఇండియన్ 2’ కంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలుస్తుంది ఈ చిత్రం.