Homeఎంటర్టైన్మెంట్Rajinikanth 225 crore remuneration: రజినీకాంత్ కి 225 కోట్ల రూపాయిలు ఇవ్వడానికి సిద్దమైన కమల్...

Rajinikanth 225 crore remuneration: రజినీకాంత్ కి 225 కోట్ల రూపాయిలు ఇవ్వడానికి సిద్దమైన కమల్ హాసన్..కారణం ఏంటంటే!

Rajinikanth 225 crore remuneration: తమిళ సినిమా ఇండస్ట్రీ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు రెండే రెండు. ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth), మరొకటి కమల్ హాసన్(Kamal Hassan). 5 దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో ఎన్నో సంచలనాత్మక పాత్రలతో ఆడియన్స్ ని అలరిస్తూ, నేటి తరం హీరోలతో కూడా పోటీ పడుతూ రికార్డ్స్ ని కొల్లగొడుతున్నారు. ఇలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని నేటి తరం ఆడియన్స్ కోరిక. త్వరలోనే అది నెరవేరబోతోంది అనుకోండి, అది వేరే విషయం, కెరీర్ ప్రారంభం లో వీళ్లిద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అత్యధిక సినిమాల్లో రజినీకాంత్ విలన్ గా నటించగా, కమల్ హాసన్ హీరో గా నటించాడు. అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక మల్టీస్టార్రర్ తెరకెక్కే ముందు, కమల్ హాసన్ నిర్మాతగా, రజినీకాంత్ హీరో గా ఒక సినిమా రాబోతుంది.

ఈ చిత్రానికి ‘డాన్’ ఫేమ్ సీబీఐ చక్రవర్తి దర్శకత్వం వహించబోతున్నాడు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నటించడం కోసం రజినీకాంత్ అక్షరాలా 225 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు అట. రజినీకాంత్ సినిమా యావరేజ్ రేంజ్ లో ఉన్నా అవలీల గా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టగలడు. అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాబట్టే, కమల్ హాసన్ కూడా రజినీకాంత్ డిమాండ్ చేయకముందే 225 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ పాత్రల పై అగ్రిమెంట్ కూడా చేసాడట. అందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇంత రెమ్యూనరేషన్ ఇస్తున్నప్పుడు, డైరెక్టర్ ని కూడా అదే స్థాయి వ్యక్తిని తీసుకొని ఉండుంటే బాగుండేది అని అంతా అంటున్నారు. ఎందుకంటే రజినీకాంత్ ప్రస్తుతం కాంబినేషన్స్ తో మాత్రమే భారీ వసూళ్లను రాబడుతున్నాడు.

ఒకప్పుడు ఉన్న మార్కెట్ ఇప్పుడు రజినీకాంత్ కి లేదు. ఒకప్పుడు డైరెక్టర్ తో సంబంధం లేకుండా, కేవలం రజినీకాంత్ పేరు మీద వసూళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు రజినీకాంత్ పేరు కి ఒక క్రేజీ డైరెక్టర్ తోడు అయితేనే భారీ వసూళ్లు వస్తున్నాయి. ఉదాహరణకు వెట్టియాన్, కూలీ చిత్రాలను తీసుకుందాం. ‘వెట్టియాన్’ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద క్లోజింగ్ లో కేవలం 220 కోట్లు మాత్రమే రాబట్టింది. కూలీ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ రెండు సినిమాలకు తేడా కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ ని కమల్ హాసన్ సెట్ చేసి రజినీకి 225 కోట్ల రెమ్యూనరేషన్ ఇచుంటే బాగుండేది అనేది నెటిజెన్స్ అభిప్రాయం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
AP Local Body Elections

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...
AP BJP

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...
Oktelugu Epaper