Homeఎంటర్టైన్మెంట్NTR Acting: ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయిన క‌ళాత‌ప‌స్వి !

NTR Acting: ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయిన క‌ళాత‌ప‌స్వి !

NTR Acting: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో వచ్చిన భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. స్నేహానికి ప్రాణమిచ్చే పాత్రలో ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉంది. అమాయకత్వంతో కూడిన విప్లవ వీరుడు భీమ్ పాత్రలో తారక్ ఒదిగిపోయారు. తన నటనతో ఎన్టీఆర్ అబ్బురపరిచారు. అసలు, ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ న‌ట‌న‌కు ముగ్ధులు కాని వారు లేరు.

NTR Acting
RRR

ఈ నేప‌థ్యంలోనే క‌ళాత‌ప‌స్వి విశ్వనాధ్ గారు ఎన్టీఆర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కొమురం భీముడో పాట‌లో ఎన్టీఆర్ న‌ట‌న‌కు ఆయ‌న స్పెల్ బౌండ్ అయ్యి, ఎమోష‌నల్ అయ్యార‌ట‌. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ కు స్వ‌యంగా ఫోన్ చేసి కూడా ఆయ‌న చెప్పార‌ట‌. విశ్వనాధ్ గారికి తొందరగా ఎవరి నటన అంత తొందరగా నచ్చదు. కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడి నటన విషయంలోనే విశ్వనాధ్ గారు పెద్దగా ఎగ్జైట్ అయ్యేవారు కాదు.

NTR Acting
K Viswanath

అలాంటది, ఎన్టీఆర్ నటనకు ఆయన ఫిదా అయ్యారు. అంటే.. ఎన్టీఆర్ నటన అంత గొప్పగా ఉందని అర్ధం. అందుకే ‘ఆర్ఆర్ఆర్‌’ లో ఎన్టీఆర్ నటనను అమితంగా ప్ర‌శంసిస్తూ ప్రేమ‌ వ‌ర్షం కురిపిస్తున్నారు. కథను బట్టి ఎన్టీఆర్ విల‌క్ష‌ణ‌మైన వాట‌ర్ లాగా ఫీల్ అవుతూ ఉత్త‌మ‌మైన న‌ట‌న‌ను కనబర్చాడు. తన అభిన‌యంతో ప్రేక్షక హృద‌యాల‌ను ఆకట్టుకున్నారు.

Also Read: Naga Chaitanya Thank You: జూలై 8న ‘థాంక్యూ’.. చైతు కొత్తగా ట్రై చేశాడు !

‘కొమురం భీముడో’ పాట‌లో ఎన్టీఆర్ నటనకు అభిమానులు మురిసిపోతున్నారు. ఇక నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ స్థాయి ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ఎన్టీఆర్ – చరణ్ లు సరికొత్త రికార్డులను సెట్ చేచేశారు.

NTR Acting
NTR

ఏది ఏమైనా ఎన్టీఆర్ ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల సమయాన్ని పెట్టాడు. అందుకే ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫాలోవర్స్ కూడా ఈ సినిమాపై ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, తీరా సినిమా విడుదలైన తర్వాత చూస్తే.. ఆశించిన స్థాయిలో ఎన్టీఆర్ ట్రాక్ లేదు. ఈ విషయంలోనే చాలా మంది ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఎన్టీఆర్ నటనకు గొప్ప పేరు వస్తోంది.

Also Read: Vijayanagaram District: ఆ జిల్లాలో అధికార పార్టీకి షాకిస్తున్న నేతలు.. ఎందుకలా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper