Homeఎంటర్టైన్మెంట్Adhurs Re Release: మళ్లీ ఆ బ్లాక్ బస్టర్ మూవీ రిరీలీజ్.. ప్రేక్షకులకు పండుగే.. తేదీ...

Adhurs Re Release: మళ్లీ ఆ బ్లాక్ బస్టర్ మూవీ రిరీలీజ్.. ప్రేక్షకులకు పండుగే.. తేదీ ఎప్పుడంటే?

సంక్రాంతి సందర్భంగా భారీ చిత్రాలను రిలీజ్ చేస్తారు. ఇందులో భాగంగా 2010 జనవరి 13న రిలీజ్ అయింది అదుర్స్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వివివినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈమూవీని వల్లభనేని వంశీ, కొడాలి నానిలు కలిసి నిర్మించారు.

Adhurs Re Release: : టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరో అనిపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. భారీ యాక్షన్ తో పాటు విభిన్న యాక్టింగ్ తో అలరించే జూనియర్ లో హ్యూమర్ సెన్స్ కూడా విపరీతంగా ఉంటుంది. ఆ విషయాన్ని ఇప్పటికే పలు సినిమాల్లో నిరూపించాడు ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ టైం కామెడీగా వచ్చిన మూవీ ‘అదుర్స్’. 13 ఏళ్ల కిందట వచ్చిన ఈ మూవీ మొదట్లో ఏమాత్రం అంచానాలు లేవు. కానీ ఆ తరువాత సినిమా గురించి తెలిశాక థియేటర్లకు పరుగులు పెట్టారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే అక్కడి నుంచి కదలరు. ఈ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో తెలుసా?

సంక్రాంతి సందర్భంగా భారీ చిత్రాలను రిలీజ్ చేస్తారు. ఇందులో భాగంగా 2010 జనవరి 13న రిలీజ్ అయింది అదుర్స్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వివివినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈమూవీని వల్లభనేని వంశీ, కొడాలి నానిలు కలిసి నిర్మించారు. కథను కోన వెంకట్ అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో అలరించారు. సినిమా టోగ్రఫీ తో సినిమా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అదుర్స్ లో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ నటించారు. ఒకటి నరసింహా పాత్ర కాగా.. మరొకటి చారి పాత్ర. ఈ రెండు పాత్రల్లోనూ ఎన్టీఆర్ తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. ఓ వైపు మాస్ హీరో అనిపించుకుంటూనే కామెడీ చేస్తూ కడుపుబ్బా నవ్వించాడు. జూనియర్ కు తోడుగా బ్రహ్మానందం పోటీపడి మరీ నటించి ప్రేక్షకుల్లో విపరీతమైన వినోదాన్ని పంచాడు. వివివినాయక్ సినిమాలు మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా హ్యుమర్ సెన్స్ కూడా ఉంటాయని ఈ సినిమాతో నిరూపించారు. ఇక ఇందులో నయనతార, షీలాలు తమ అందచందాలతో అలరించారు.

‘అదర్స్’ ను 23 ఏళ్ల తరువాత రీ రీలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోకి ఎంట్రీ ఇచ్చి 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అదుర్స్ ను థియేటర్లోకి తీసుకొస్తున్నారు. 2023 నవంబర్ 18న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైన్ గా నిలిచిన ఈ మూవీని మరోసారి ఆదరిస్తారని అంటున్నారు. ఇప్పటికీ అదుర్స్ టీవీల్లో వస్తే తప్పకుండా చూస్తున్నారు. ఇక థియేటర్లో మరోసారి ఎంజాయ్ చేస్తారని సినిమా బాధ్యులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper