Homeఎంటర్టైన్మెంట్Jr NTR New House: ఇంద్ర భవనాన్ని మించి.. ఎన్టీఆర్ కొత్త ఇల్లు చూస్తే కళ్లు...

Jr NTR New House: ఇంద్ర భవనాన్ని మించి.. ఎన్టీఆర్ కొత్త ఇల్లు చూస్తే కళ్లు చెదురుతాయి

Jr NTR New House: ఎన్టీఆర్ ఇంటిని ఎప్పుడైనా చూశారా? ఇంద్ర భవనానికి ఏం తక్కువ కాదు. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో నివాసంలో చిన్న వేడుక చేసుకున్నట్లు సమాచారం. సదరు వేడుకల ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్(NTR HOUSE) ఇంటి లోపలి దృశ్యాలు బయటపడ్డాయి.

ఎన్టీఆర్(NTR) ఫుల్ బిజీ. ఆయన నటించిన వార్ 2(WAR 2) విడుదలకు సిద్ధం అవుతుంది. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ వార్ 2 ట్రైలర్ అంచనాలు అందుకుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల రోల్స్ డిజైన్ చేసిన తీరు బాగుంది. వారిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. వార్ 2 కోసం వారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వార్ 2 ఆగస్టు 14న థియేటర్స్ లోకి రానుంది.

Also Read: ‘ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్’ ఫుల్ మూవీ రివ్యూ…

వార్ 2 ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పాల్గొనాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్, నార్త్ లో వార్ 2 ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఏపీ/తెలంగాణలలో వార్ 2 రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. వార్ 2 విజయం ఎన్టీఆర్ కి కీలకం. నార్త్ లో మరింత ఇమేజ్ రాబట్టాలంటే వార్ 2 భారీ హిట్ కొట్టాలి. మరోవైపు ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్నారు ఎన్టీఆర్.

ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ అనుకున్నారనే ప్రచారం జరుగుతుంది. డ్రగ్ మాఫియా నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా డ్రాగన్ ఉంటుందట. ఎన్టీఆర్ కి జంటగా రుక్మిణి వసంత్ ని ఎంపిక చేశారని సమాచారం. ప్రశాంత్ నీల్ చిత్రాల్లో హీరోలకు మాస్ ఎలివేషన్స్ గూస్ బంప్స్ రేపేలా ఉంటాయి. తమ హీరోని స్క్రీన్ పై ప్రశాంత్ నీల్ ఎలా ప్రజెంట్ చేయనున్నాడనే ఆసక్తి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో నెలకొంది.

Also Read:  ‘వార్ 2’ లో ఎవరు హీరో..? ఎవరు విలన్..? ట్రైలర్ అయ్యోమయంలోకి నెట్టేసిందిగా!

ఇంత బిజీ షెడ్యూల్స్ మధ్య ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో వీకెండ్ పార్టీ చేసుకున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో పాటు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు ఫోటోల్లో ఎన్టీఆర్ ఇంటి లోపలి దృశ్యాలు బహిర్గతం అయ్యాయి. ఇటీవల ఎన్టీఆర్ ఇంటీరియర్ ని కొత్తగా డిజైన్ చేయించాడట. ఎన్టీఆర్ ఇల్లు అద్భుతంగా ఉంది. ఆధునిక హంగులతో ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి..

RELATED ARTICLES

Most Popular