Juice Diet Death: నేటి కాలంలో శారీరక శ్రమ లేకపోవడంతో చాలామంది ఊరికనే లావు అవుతున్నారు. దాన్ని తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడం.. రకరకాల ఆహార నియమాలు పాటించడం.. వంటివి చేస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి అనేకమంది నిపుణులు యూట్యూబ్లో వీడియోలను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని చాలామంది అనుకరిస్తున్నారు. అలా అలంకరించిన ఒక వ్యక్తి చివరికి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు.
Also Read: భార్య వల్ల దొంగయ్యాడు.. ఇతడి కథకు కన్నీరు పెట్టాల్సిందే..
తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కోలచల్ అనే ప్రాంతానికి చెందిన శక్తిశ్వరన్ అనే యువకుడు లావుగా ఉంటాడు. తోటి స్నేహితులు అతడిని చూసి ఎగతాళి చేసేవారు. దీంతో అతడు లావు తగ్గాలని అనుకున్నాడు. దీనికి అతడు యూట్యూబ్ ను మార్గంగా ఎంచుకున్నాడు. యూట్యూబ్ లో రకరకాల వీడియోలు చూసేవాడు. బరువు తగ్గడానికి.. శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అతడు పండ్ల రసాలను తాగడం మొదలుపెట్టాడు. గడచిన మూడు నెలలుగా అతడు ఎటువంటి ఘన ఆహార పదార్థాలను తీసుకోలేదు. కేవలం పండ్ల రసాలను మాత్రమే తీసుకోవడం వల్ల అతని ఆరోగ్యం క్షీణించింది. శరీరానికి సరిపడా కార్బోహైడ్రేట్స్, ఇతర పదార్థాలు అందకపోవడంతో అవయవాల పనితీరు మందగించింది. దీంతో అతడు గురువారం కన్నుమూసినట్టు తెలుస్తోంది.
Also Read: మనిషిని అమాంతం మింగేసిన పాము… వైరల్ వీడియో
కఠినమైన ఆహార నియమాలు పాటించడం వల్ల శరీరంలో అవయవాలు దెబ్బతిన్నాయి. పైగా అతడు ఆహార నియమాలు పాటించే సమయంలో వైద్యులను సంప్రదించలేదు. కేవలం పండ్ల రసాలను మాత్రమే తీసుకోవడం.. అది కూడా గడిచిన మూడు నెలలుగా అదే పని చేయడంతో.. ఒక్కసారిగా అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. అవయవాలు పనిచేయడం తగ్గిపోయింది. శరీరంలో వస్తున్న మార్పులను సైతం అతడు కుటుంబ సభ్యులకు చెప్పుకోలేదు. దీంతో అతడు కన్నుమూశాడు. అయితే గడిచిన మూడు నెలల్లో అతడు ఊహించిన దానికంటే ఎక్కువ బరువు తగ్గాడు. దీంతో శరీర జీవన క్రియలు పూర్తిగా అదుపుతప్పాయి. దీంతో అతడు కన్నుమూశాడు..” కఠినమైన ఆహార నియమాలు పాటించడం మంచిది కాదు. అది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. ఇష్టానుసారంగా ఆహారం తీసుకోవడం లేదా తీసుకోకపోవడం వంటివి శరీరం మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. దానివల్ల ఇబ్బంది పడాల్సి ఉంటుంది. జీవన క్రియలలో తేడా ఏర్పడితే అది అంతిమంగా శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి అకాలమైన మరణాలు చోటు చేసుకుంటాయి. ఎవరో చెప్పినట్టు చేయాలి అంటే సాధ్యమయ్యే పని కాదు. బరువు అధికంగా ఉన్నవారు తగ్గాలంటే వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. మంచి అలవాట్లను పాటించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇదిగో ఇలాంటి ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని” వైద్యులు చెబుతున్నారు.