The Fantastic 4 First Steps Review: ఫస్ట్ సినిమా చరిత్రలో హాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు ప్రతి ప్రేక్షకులను అరిస్తూ ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ల నుంచి వచ్చిన ప్రతి సినిమా ఇండియన్ ప్రేక్షకులందరికీ కాకుండా భారీ కలెక్షన్స్ ని కూడా సంపాదించి పెట్టాయి… ఇప్పుడు ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయం మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: వసూళ్ల లో వెనకబడుతున్న ‘మెగా’ సినిమాలు..
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే సంవత్సరంలో భార్య భర్తలైన రీడ్ రిచర్డ్(షెడ్రో పాస్కల్), న్యూ స్ట్రీమ్ (వెన్నెస్సా కిర్భి) తల్లిదండ్రులు కాబోతున్నారున్న సంతోషకరమైన న్యూస్ తెలిసిన సందర్భంలో ఆకాశం నుంచి సిల్వర్ సర్ఫర్ (షల్లా) వచ్చి భూమిని మింగేయడానికి గాలక్టాస్ వస్తున్నాడానికి చనిపోవడానికి సిద్దమవ్వండని హెచ్చరించి వెళ్ళిపోతుంది…ఇక దాని నుంచి ఫెంటాస్టిక్ ఫోర్ ఎలా భూమిని కాపాడారు. పుట్టబోయే బిడ్డ కి ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ మూవీ కథని చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా యాంగేజింగ్ గా తీసుకెళ్లారు.ఎక్కడ ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండాడు సూపర్ హీరోలు కలిసి చాలా విన్యాసాలైతే చేశారు…దర్శకుడు మ్యాట్ చాలా బాగా తెరకెక్కించారు. ఇంతకు ముందు ఎలాంటి సినిమాలు వచ్చిన కూడా ఇప్పుడు మాత్రం ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు…
విజువల్స్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి… ఇక దానికి తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. దాంతో సినిమా చాలా బాగా ఎలివేట్ అయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి…ముఖ్యంగా సిల్వర్ సల్ఫర్ వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొనే ఫైట్ స్క్వెన్స్ ను చాలా బాగా తెరకెక్కించారు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఫెంటాస్టిక్ ఫోర్ గా చేసిన నటులు వాళ్ల బెస్ట్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు…ఇక సినిమా అంత ఎఫెక్టివ్ గా రావడానికి వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా వరకు యూజ్ అయింది…మొత్తానికైతే నటులందరూ కలిసి మంచి పర్ఫామెన్స్ ఇచ్చి సినిమాను విజయతిరాలకు చేర్చారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ అయితే చాలా ఎఫెక్టివ్ గా ఉంది. వాల్ డిస్నీ వాళ్ళు ఎంత క్వాలిటీ వర్క్ ఇస్తారో ఇంతకు ముందు మనం చాలా సినిమాల్లో చూశాం…ఇక దానికి తగ్గట్టుగానే అంతరిక్షం నుంచి సల్ఫర్ వచ్చినప్పుడు చాలా చక్కటి గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు…
Also Read: విశ్వంభర రిలీజ్ డేట్ కంఫర్మ్ కాలేదు.. ఇక ఆశలన్నీ ‘OG’ పైనేనా?
ప్లస్ పాయింట్స్
ఫోర్ మెంబార్స్ యాక్టింగ్
గ్రాఫిక్స్
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
యాక్షన్ సీక్వెన్స్ ఇంకాస్త ఎఫెక్టివ్ గా ఉంటే బాగుండేది…
రేటింగ్
ఈ మూవీ కి మేమిచ్చే రేటింగ్ 2.5/5