Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan Twitter Review: 'జన నాయగన్ ' ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్...

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి రియాక్షన్ ఊహించలేదు..

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం ఎదురుకున్న ఇక్కట్ల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎట్టకేలకు వాటి అన్నిటిని విజయవంతంగా ఎదురుకొని నేడు ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ఇది టాలీవుడ్ లో బాలయ్య హీరో గా నటించిన భగవంత్ కేసరి కి రీమేక్ అనే సంగతి అందరికీ […]

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం ఎదురుకున్న ఇక్కట్ల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎట్టకేలకు వాటి అన్నిటిని విజయవంతంగా ఎదురుకొని నేడు ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ఇది టాలీవుడ్ లో బాలయ్య హీరో గా నటించిన భగవంత్ కేసరి కి రీమేక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ మేకర్స్ అలా ప్రమోట్ చేయకుండా , కేవలం సన్నివేశాలను మాత్రమే తీసుకున్నాం అంటూ ప్రచారం చేశారు. కానీ ట్రైలర్ చూస్తే భగవంత్ కేసరి కి జిరాక్స్ కాపీ అనే చెప్పాలి. మరి ఈ తమిళ వెర్షన్ భగవంత్ కేసరి ఆడియన్స్ ని అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ముందుగా ఫస్ట్ హాఫ్ గురించి నెటిజెన్స్ ఏమంటున్నారో ఒకసారి గమనించగా, ఇంటర్వెల్ సన్నివేశం చాలా సాలిడ్ గా ఉంది , కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు వర్కౌట్ అయ్యాయి కానీ , డైరెక్టర్ టేకింగ్ మాత్రం అసలు బాగాలేదని, బాబీ డియోల్ ట్రాక్ చాలా చెత్తగా ఉందని అంటున్నారు. అంతే కాకుండా VFX వర్క్ చాలా దారుణంగా ఉందని , సినిమాకు అతి ముఖ్యమైన కూతురు ఎమోషన్ సరిగా పండలేదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం విజయ్ , అనిరుద్ మాత్రమే ప్లస్ పాయింట్స్ గా నిలిచారని , వాళ్ళ పనితనం తప్ప , ఫస్ట్ హాఫ్ ఏమి లేదని చెప్పుకొచ్చారు. సెకండ్ హాఫ్ లో కూడా ఇదే పరిస్థితి. కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు వర్కౌట్ అయ్యాయి అట , అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కలిసొచ్చింది అట. కానీ ఓవరాల్ సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది అట. భగవంత్ కేసరి ని డిట్టో దింపినా బాగుండేది , కానీ డైరెక్టర్ వినోద్ చేసిన మార్పులు చేర్పులు ఈ సినిమా కొంపమించిందని అంటున్నారు.

ఇక విలన్ గా చేసిన బాబీ డియోల్ క్యారెక్టర్ ని చూస్తే నవ్వు వచ్చేలా ఉందని అంటున్నారు నెటిజెన్స్. అంతా వీక్ గా డిజైన్ చేశారట. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అసలు బాగాలేదని , సినిమా స్క్రీన్ ప్లే ఒక ఫ్లో లో వెళ్లకుండా, ఎమోషనల్ సన్నివేశాలు మధ్యలో అతికించినట్టు ఉండడం తో , ఒరిజినల్ వెర్షన్ లో కలిగే ఎమోషనల్ ఫీలింగ్ ఈ సినిమా ని చూస్తున్నంతసేపు పొందలేమని, ఇక క్లైమాక్స్ సన్నివేశం అయితే మన సహనానికి పరీక్ష పెడుతుందని అంటున్నారు. ఓవరాల్ గా విజయ్ ని చివరిసారిగా వెండితెర మీద చూసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాకు వెళ్లగలరని , మామూలు ఆడియన్స్ చూడలేరని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper