Homeఎడ్యుకేషన్NEET PG Counselling 2026: నీట్ పీజీ కౌన్సిలింగ్ లో కీలక పరిణామం.. అభ్యర్థులు చేయాల్సింది...

NEET PG Counselling 2026: నీట్ పీజీ కౌన్సిలింగ్ లో కీలక పరిణామం.. అభ్యర్థులు చేయాల్సింది ఇదే..

NEET PG Counselling 2026: నీట్ పేపర్ లీకేజీ.. అనేక రకాలైన ఆరోపణలు.. ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో.. ఈసారి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఎక్కడ కూడా పేపర్ లీకేజీకి.. ఇతర అక్రమాలకు అవకాశం లేకుండా పకడ్బందీగా వ్యవహరించింది. తద్వారా ఈసారి నీట్ పీజీ పరీక్షలో పారదర్శకత మరింత స్పష్టంగా కనిపించింది. కీలక పరిణామం వైద్య విద్యలో పిజి కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పీజీ కౌన్సిలింగ్ 2026 […]

NEET PG Counselling 2026: నీట్ పేపర్ లీకేజీ.. అనేక రకాలైన ఆరోపణలు.. ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో.. ఈసారి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఎక్కడ కూడా పేపర్ లీకేజీకి.. ఇతర అక్రమాలకు అవకాశం లేకుండా పకడ్బందీగా వ్యవహరించింది. తద్వారా ఈసారి నీట్ పీజీ పరీక్షలో పారదర్శకత మరింత స్పష్టంగా కనిపించింది.

కీలక పరిణామం

వైద్య విద్యలో పిజి కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పీజీ కౌన్సిలింగ్ 2026 లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేసింది. ఎండి, ఎంఎస్ వంటి పిజి వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం కేటాయించిన సీట్ల వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను పరిశీలించవచ్చు.

28 728 మందికి సీట్ల కేటాయింపు

నీటి పీజీ 2026 తొలి విడత కౌన్సిలింగ్లో మొత్తం 28728 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. అభ్యర్థులు తుది వివరాల కోసం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన అధికారిక ఫలితాలను పరిశీలించాలి. అభ్యర్థుల నీట్ పీజీ ర్యాంకు.. రిజర్వేషన్ కేటగిరి. అందుబాటులో ఉన్న సీట్లు.. వెబ్ ఆప్షన్ లలో ఇచ్చిన ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుని సీట్ల కేటాయింపు చేపట్టారు. కేంద్ర కౌన్సిలింగ్ ద్వారా ఆల్ ఇండియా కోటాలో 50 శాతం ఎండి, ఎంఎస్ సీట్లను భర్తీ చేస్తారు. మిగిలిన రాష్ట్ర కోట సీట్లకు ఆయా రాష్ట్రాల అధికారులు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇక తొలి విడత ఆల్ ఇండియా కోటా సీట్ల కేటాయింపులు నమోదైన కేటగిరి వారి క్లోసింగ్ ర్యాంకులను పరిశీలిస్తే.. జనరల్ లో క్లోజింగ్ ర్యాంకు 1,27,533 గా ఉంది. ఈడబ్ల్యూఎస్ భాగంలో 1,32,185 గా ఉంది. ఓబీసీలో 1,49,301 గా ఉంది. ఎస్సీలో 1,59,338 గా, ఎస్టీలో 1,59,693 గా ఉంది.. ఇక ఈ ర్యాంకులు తొలి విడతలో సీట్ సాధించిన చివరి అభ్యర్థుల ర్యాంకులను సూచిస్తాయి. కాలేజీ.. కోర్సు.. సీటు.. కేటగిరి ఆధారంగా కట్ ఆఫ్ మారే అవకాశం ఉంది. తొలి విడతలో సీటు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 లోపు కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేసిన అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. నవంబర్ మూడున అభ్యర్థుల వివరాల ధ్రువీకరణ చేపడతారు

అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు

  • నీట్ పీజీ అడ్మిట్ కార్డు
  • ఎంబిబిఎస్ మార్కుల మెమో, డిగ్రీ సర్టిఫికెట్
  • ఇంటర్న్ షిప్ పూర్తిచేసిన ధ్రువీకరణ పత్రం
  • మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డు, పుట్టిన తేది ధ్రువీకరణ
  • కుల దృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
  • అభ్యర్థులు తమ అలాట్మెంట్ లెటర్లో ఉన్న సూచనలు కంపల్సరీ పాటించాలి.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper