Homeఎంటర్టైన్మెంట్Johnny Master: జానీ మాస్టర్ ని రక్షించిన చిరంజీవి, బాలకృష్ణ.. వీడియో వైరల్..

Johnny Master: జానీ మాస్టర్ ని రక్షించిన చిరంజీవి, బాలకృష్ణ.. వీడియో వైరల్..

Johnny Master: గత కొద్దిరోజుల నుండి డ్యాన్సర్స్ అసోసియేషన్ లో జరుగుతున్న గొడవలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 2 కొరియోగ్రాఫర్స్ గా పేరొందిన జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ మధ్య నడుస్తున్న వివాదం , అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. కానీ మరుసటి రోజు జానీ మాస్టర్ ని ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, […]

Johnny Master: గత కొద్దిరోజుల నుండి డ్యాన్సర్స్ అసోసియేషన్ లో జరుగుతున్న గొడవలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 2 కొరియోగ్రాఫర్స్ గా పేరొందిన జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ మధ్య నడుస్తున్న వివాదం , అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. కానీ మరుసటి రోజు జానీ మాస్టర్ ని ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, శేఖర్ మాస్టర్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని చెప్పి , అసలు ఎందుకు ఇంత రాదంతం జరిగిందో వివరించారు. అయితే ఫిలిం ఫెడరేషన్ పై ఆరోపణలు చేసినందుకు , ఫెడరేషన్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జానీ మాస్టర్ ఇండియా లో ఏ ఇండస్ట్రీ లో పని చేసినా , 23 క్రాఫ్ట్స్ కి సంబంధించిన వాళ్ళు పని చెయ్యరు నిర్దిష్ట సమయం లో ఆయన ఫెడరేషన్ కి వచ్చి వివరణ ఇవ్వకపోతే ఆయన పై మేము బ్యాన్ విధిస్తాం అంటూ హెచ్చరించారు.

విషయం చాలా దూరం వెళ్లడంతో , శేఖర్ మాస్టర్ తన సతీమణి సుమలత తో కలిసి ఫెడరేషన్ కి వచ్చి వివరణ ఇచ్చారు. ఆయన వివరణ కి సంతృప్తి చెందిన ఫెడరేషన్ సభ్యులు , జానీ మాస్టర్ పై ఎలాంటి నిషేధం విధించబోవడం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయనకు పెద్ద ఊరట లభించింది అనే చెప్పాలి. అనంతరం ఫిలిం ఫెడరేషన్ ఏర్పాటు చేసిన విలెక్షరుల సమావేశం లో జానీ మాస్టర్ తన సతీమణి సుమలత తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినీ ఇండస్ట్రీ లో ఏ చిన్న కష్టమొచ్చినా మెగాస్టార్ చిరంజీవి గారు అండగా నిలబడి పరిష్కరిస్తుంటారు. నాకు , శేఖర్ మాస్టర్ కి చిన్న పాటి వాదనలు వచ్చిన విషయాన్నీ తెలుసుకొని , మా ఇద్దరినీ పిలిపించి మాట్లాడి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు’.

‘ఇప్పుడు కూడా ఆయన చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపించారు. ఆయనకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా సమస్యలన్నీ ఫెడరేషన్ సబ్యులకు వివరించాము. అందుకు వాళ్ళు ఎంతో సంతృప్తి చెందారు. ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుందని నేను భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం ఫెడరేషన్ సభ్యులు మీడియా తో మాట్లాడుతూ , జానీ మాస్టర్ ఇక్కడికి వచ్చి అన్నీ వివరించారు , అందుకు మేము సంతృప్తి చెందాము , ఈ విషయం లో చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper