Homeఎంటర్టైన్మెంట్Jabardasth Naresh remuneration : ఒక్కో ఈవెంట్ కి జబర్దస్త్ నరేష్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో...

Jabardasth Naresh remuneration : ఒక్కో ఈవెంట్ కి జబర్దస్త్ నరేష్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..ఖరీదైన కమెడియన్!

Jabardasth Naresh remuneration :ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించిన కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నగా కనిపిస్తాడు కానీ, ఇతని కామెడీ టైమింగ్ మామూలు రేంజ్ లో ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ ని సంపాదించిన ఎంతో మంది కమెడియన్స్ సినిమా అవకాశాల కోసం ఆ షో ని వదిలి వెళ్లిపోయారు. కానీ నరేష్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాడు. చూసేందుకు చిన్న పిల్లవాడిగా అనిపించే నరేష్ వయస్సు దాదాపుగా 30 ఏళ్ళ వరకు ఉంటుంది. జన్యు పరంగా లోపాలు ఉండడం వల్ల ఆయన హైట్ పెరగలేకపోయాడు. అయితే తనలో ఉన్న ఈ లోపాన్ని పాజిటివ్ గా మార్చుకొని కామెడీ చేస్తూ, మనలోని లోపాలతో కూడా ఇండస్ట్రీ లో సక్సెస్ కావొచ్చు అనే భరోసా ఎంతో మందిలో కల్పించాడు.

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నరేష్ ఒక్కో షో లేదా ఈవెంట్ కి తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ నడుస్తోంది. నరేష్ జబర్దస్త్ షోలోకి బులెట్ భాస్కర్ టీం ద్వారా పరిచయం అయ్యాడు. ఆ టీం లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత , అతనికి ఒక్కో స్కిట్ కి లక్ష రూపాయిలు ఇచ్చేవారు. ఇక టీం లీడర్ గా ఎదిగిన తర్వాత ఆయన ఒక్కో ఎపిసోడ్ కి 2 నుండి 2 లక్షల 50 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని నెలలో మొత్తం మీద ఆయన నాలుగు జబర్దస్త్ ఎపిసోడ్స్ చేస్తాడు కాబట్టి , నెలకు కేవలం జబర్దస్త్ నుండి 8 నుండి 10 లక్షల రూపాయిలు వస్తాయని అంటున్నారు.

అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు ఈటీవీ లో కొన్ని పండగ స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. వాటిల్లో కూడా నరేష్ పాల్గొంటూ ఉంటాడు. అలా అన్ని కలుపుకొని చూస్తే నెలకు ఆయన యావరేజ్ గా 15 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటాడట. ఆ విధంగా బుల్లితెర పై మోస్ట్ కాస్ట్లీ కమెడియన్ గా నరేష్ పేరు చెప్పొచ్చని అంటున్నారు. ఒక్కో నెల పాతిక నుండి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయట. చిన్నతనం లో ఎన్నో ఇబ్బందులు , సవాళ్ళను ఎదురుకొని ఈ స్థాయికి వచ్చిన నరేష్ , సినిమాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తే ఇక ఏ రేంజ్ లో సంపాదిస్తాడో మీరే ఊహించుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...
Hydra Ranganath

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...
Vijay

Vijay: విజయ్ తర్వాత తమిళ్ ఇండస్ట్రీ లో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునేది ఆయనేనా…

Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు విజయ్ నెంబర్ వన్ హీరోగా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు వెళ్లిపోయాడు. కాబట్టి తను సినిమాలు చేసే అవకాశామైతే లేదు. ఇక రీసెంట్...
Nara Lokesh

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....
August School Holiday

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...
Oktelugu Epaper