Shyamala : తెలిసో తెలియకో ఒకప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా అని ఆశపడి అనేకమంది సెలెబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసారు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు గజగజ్జ వణికిపోతున్నారు. ఎందుకంటే VC సజ్జనార్ ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీల పై ఉక్కుపాదం మోపుతున్నాడు. వరుసగా సెలబ్రిటీల పై కేసులు వేస్తున్నారు. ఇప్పటి వరకు విష్ణు ప్రియ(Vishnu Priya), టేస్టీ తేజ(tasty teja), హర్ష సాయి(Harsha Sai), బన్నీ సన్నీ యాదవ్(Bunny Sunny yadav), కిరణ్ గౌడ్, యాంకర్ శ్యామల(Anchor Shyamala), పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, రీతూ చౌదరి, సుప్రీత ఇలా ఎంతో మంది ప్రముఖ సెలబ్రిటీలపై కేసులు నమోదు అయ్యాయి. హర్ష సాయి, రీతూ చౌదరి, సుప్రీత వంటి వారు భవిష్యత్తులో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయబోమని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని, ఈ బెట్టింగ్ యాప్స్ ని అరికట్టేందుకు తమ వంతు సాయం చేస్తామని ఒక వీడియో ని విడుదల చేసారు.
Also Read : యాంకర్ శ్యామల ఆన్ డ్యూటీ.. వస్తూనే చంద్రబాబు పై హాట్ కామెంట్స్*
మిగిలిన సెలబ్రిటీస్ కూడా అలాంటి వీడియోస్ ని అప్లోడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కేసు నమోదు కాబడిన సెలబ్రిటీస్ లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిన సెలబ్రిటీ యాంకర్ శ్యామల. ఈమె గతం లో పలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసింది. వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి గా ఉంటూ గతంలో ఇలాంటి పనులు చేసి, నువ్వు కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు లాంటి వారిపై కామెంట్స్ చేస్తావా అంటూ సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి ఆమెను ఏకిపారేస్తున్నారు. తనపై సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈ రేంజ్ లో ప్రచారం చేస్తున్నప్పటికీ యాంకర్ శ్యామల నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. సెలబ్రిటీస్ అందరూ వీడియోలు అలా చేసి అప్లోడ్ చేయడానికి ప్రధాన కారణం అరెస్ట్ నుండి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశ్యం ఉంది.
కానీ శ్యామల ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి అయ్యుండి, దీనిపై ఆమె స్పందించాల్సిన అవసరం లేదా?, ఒక మాజీ సీఎం పార్టీ లో ముఖ్య పదవి లో ఉంటూ, ఆమె దీనిపై స్పందించి ‘గతంలో ఎదో పొరపాటున ఇలాంటి యాడ్స్ ని ప్రమోట్ చేశాను. ఇక నుండి అలాంటివి చేయను, బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాలను జనాలకు తెలియచేసి వారిలో చైతన్యం తీసుకొస్తాను’ అని చెప్తే చాలా గౌరవంగా ఉంటుంది. కానీ ఆమె ఇప్పటి వరకు అలాంటివేమీ చేయలేదు. బాధ్యత లేని సెలెబ్రిటీలు సినీ పరిశ్రమలో ఉండడమే ప్రమాదం అనుకుంటే, ఈమె ఏకంగా రాజకీయ పార్టీ లో ఉంది. దయచేసి పోలీసులు ఆమె పై కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈలోపు అయినా ఆమె ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి సమస్యని పరిష్కరించుకుంటుందా లేదా అనేది చూడాలి.
Also Read : యాంకర్ శ్యామల చీకటి బాగోతం బయటపెడతా అంటున్న టీడీపీ నేత… ముదిరిన వివాదం!