Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు?!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు?!

Pawan Kalyan: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది. ప్రభుత్వ పెద్దలు బాగానే కష్టపడుతున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు ఊపందుకుంటోంది. అయితే రెండేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడిప్పుడే కొంతమంది కుహనా మేధావులు, తటస్థుల ముసుగులో బయటకు వస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రతినిధుల పై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో వారిని కట్టడి చేసేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కీలక భేటీ జరుపుతున్నట్లు సమాచారం.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

* కుల చిచ్చు పై..
టిటిడి చైర్మన్ పై ఫేక్ వీడియోలు( fake videos), రాజకీయ విశ్లేషకుల ముసుగులో కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం, సామాజిక వర్గాల పేరుతో రాజకీయం చేయడం.. వీటన్నింటి పైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా చర్చిస్తారని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారం ఒక్కొక్కరిని తెరపైకి తెస్తుండడం కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు కారణం అయ్యాయి. మరోసారి అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని చంద్రబాబు ఆలోచన. ముఖ్యంగా కుల రాజకీయాలు చేసి ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే రాజకీయంగా దానిని ఎదుర్కొనే బాధ్యత పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తోంది.

* పవన్ ప్రత్యేక ప్రకటనలు..
వాస్తవానికి ప్రభుత్వపరంగా చంద్రబాబు( CM Chandrababu) పవర్ ఫుల్. అలాగే రాజకీయపరమైన అంశాల విషయంలో పవన్ కళ్యాణ్ మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సేవలను చంద్రబాబు వినియోగించుకోనున్నారు. సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం, కూటమి నేతలపై ఫేక్ వీడియోలతో ప్రచారాలు.. వీటన్నింటి పైన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా చంద్రబాబు రంగంలోకి దిగితే.. రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను పవన్ కళ్యాణ్ దీటుగా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కుల రాజకీయాలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలపై పవన్ కళ్యాణ్ ఉక్కు పాదం మోపుతారని తెలుస్తోంది. చూడాలి మరి పవన్ నోటి నుంచి ఎలాంటి ప్రకటనలు వస్తాయో?…

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper
Exit mobile version