https://oktelugu.com/

Anchor Shyamala : యాంకర్ శ్యామల ఆన్ డ్యూటీ.. వస్తూనే చంద్రబాబు పై హాట్ కామెంట్స్*

సినీ పరిశ్రమ అంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు ఉంది. వైసీపీలో ఉన్న నటులు సైతం సైలెంట్ అయ్యారు. కొందరు రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. యాంకర్ శ్యామల మాత్రం వైసిపి అధికార ప్రతినిధిగా కొత్త జర్నీ స్టార్ట్ చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 16, 2024 / 10:14 AM IST

    Anchor Shyamala

    Follow us on

    Anchor Shyamala : యాంకర్ శ్యామల బుల్లితెరకు దూరమైనట్టేనా? అవకాశాలు రావని ఫిక్సయ్యారా? అందుకే రాజకీయాల వైపు పూర్తిగా దృష్టి మళ్లించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసిపి ఓడిపోయిన తర్వాత తనకు రాజకీయాలు తెలియవని చెప్పుకొచ్చారు ఆమె. తాను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని కూడా ప్రకటించారు. తనకు హెచ్చరికలు వస్తున్నాయని భయం వ్యక్తం చేశారు. దీంతో యాంకర్ శ్యామల యూటర్న్ తీసుకున్నారని అంతా భావించారు. కానీ ఆమె అనూహ్యంగా వైసిపి అధికార ప్రతినిధుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.సాధారణంగా రాజకీయంగా వివాదాస్పదం అయిన సినీ నటులకు అవకాశాలు తగ్గుముఖం పడతాయని పరిశ్రమలో ఒక ప్రచారం ఉంది. ఎప్పటినుంచో ఈ ప్రచారం నడుస్తూ వచ్చింది. అయితే ఎన్నికలకు ముందు యాంకర్ శ్యామల రెచ్చిపోయారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసిపి ఓడిపోయేసరికి ఆందోళనతో కనిపించారు. కానీ ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా మారేసరికి పూర్తి రాజకీయాలు మాట్లాడుతున్నారు.భయం లేకుండానే విమర్శలు చేస్తున్నారు.దీంతో ఆమె రాజకీయాల వైపు వచ్చేసారని.. బుల్లితెరపై అవకాశాలు లేక ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    * అధికార ప్రతినిధిగా ఎంపిక
    ఇటీవల వైసిపి తన అధికార ప్రతినిధులను ప్రకటించింది. మాజీమంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులతో పాటు యాంకర్ శ్యామల సైతం పదవిని దక్కించుకున్నారు. నిన్నటి వరకు ఆమెకు పార్టీలో ఎటువంటి హోదా లేదు. అయినా సరే పార్టీ కోసం పనిచేశారు. అందుకే జగన్ ఇప్పుడు అధికార ప్రతినిధిగా అపాయింట్ చేశారు.తనను అధికార ప్రతినిధిగా నియమించినందుకు జగన్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

    * వరద బాధితులను ఆదుకోవడం ఇదా?
    వైసీపీలో కీలక బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శ్యామల పని మొదలుపెట్టారు.చంద్రబాబుతో పాటు లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆ నెపాన్ని జగన్ పై వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతమందికి సహాయపడ్డారు వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. గత జగన్ ప్రభుత్వంలో వరద బాధితులకు ఏ విధంగా సాయం చేశారు కళ్ళు తెరవాలని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు శ్యామల.

    * మీడియా ద్వారా అతి ప్రచారం
    చంద్రబాబు మీడియా బలంతో రెచ్చిపోతున్నారని కూడా శ్యామల ఆరోపించారు.ఓడిపోయిన తర్వాత కూడా జగన్ ఏ విధంగా సాయం చేశారు వివరించే ప్రయత్నం చేశారు.ఎన్నికల కు ముందు ఏ పదవి లేకుండా శ్యామల వైసీపీకి సేవలు అందించారు. వైసిపి ఓడిపోయేసరికి ఆందోళనతో కనిపించారు. ఇప్పుడు బుల్లితెరపై ఎటువంటి అవకాశాలు లేకపోవడం వల్లే ఆమె రాజకీయాల వైపు వచ్చారని.. జగన్ ఇచ్చే పేమెంట్ తో అలా మాట్లాడుతున్నారని టిడిపి శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. అయితే సినీ పరిశ్రమ అంతా కూటమి ప్రభుత్వం వైపు ఉన్న నేపథ్యంలో.. యాంకర్ శ్యామల వైసీపీ వైపు గట్టి వాయిస్ వినిపిస్తుండడం విశేషం.