Thaman
Thaman : సౌత్ ఇండియా లో అగ్ర హీరోల దగ్గర నుండి మీడియం రేంజ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరి సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ మంచి డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడిగా తమన్(SS Thaman) కి ఎంత మంచి పేరుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయన సినిమాల్లోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ వేరే లెవెల్ లో ఉంటాయి. ముఖ్యంగా ఆయన అందించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా సత్తాలేని సన్నివేశాలను కూడా వేరే లెవెల్ కి వెళ్లిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. గత నెలలో ఆయన ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలకు సంగీతం అందించాడు. గేమ్ చేంజర్ మ్యూజిక్ కి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ రాగా, డాకు మహారాజ్ చిత్రంలోని మ్యూజిక్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG), ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రాలకు ఆయన సంగీతం అందిస్తున్నాడు.
Also Read : నేను మంచి మ్యూజిక్ ఇచ్చాను..రామ్ చరణ్ డ్యాన్స్ బాగా వెయ్యలేదు – తమన్!
రీసెంట్ గానే ఆయన ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన బోల్డ్ ఇంటర్వ్యూ లో రాజా సాబ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడుతూ ‘రాజాసాబ్ చిత్రానికి పాటలు కంపోజ్ చేసి చాలా కాలం అయ్యింది. అయితే రీసెంట్ గానే ఆ పాటలను పరిశీలిస్తున్నప్పుడు ఎందుకో నాకు ఫ్రెష్ ఫీలింగ్ కలగలేదు. ఇంకా మూవీ లో ఒక్క పాట చిత్రీకరణ కూడా జరగలేదు. అందుకే నేను మళ్ళీ కొత్తగా పాటలన్ని రీ కంపోజ్ చేయాలని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. తమన్ మాట్లాడిన ఈ మాటలను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని నిన్న మొన్నటి వరకు చెప్పారు. కానీ తమన్ ఏమిటి ఇంకా పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉందని అంటున్నాడు. అసలు ఈ సినిమా ఈ ఏడాది విడుదల అవుతుందా లేదా అని మూవీ టీం ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు.
రీసెంట్ గానే ప్రభాస్ హను రాఘవపూడి తో ఒక సినిమా మొదలు పెట్టాడు.ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. పరిస్థితులను చూస్తుంటే ‘రాజా సాబ్’ కంటే ముందుగా ఆ సినిమానే విడుదల అయ్యేలా ఉందని అంటున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ ఉగాదికి ఈ చిత్రం నుండి ఒక టీజర్ విడుదల కాబోతుందట. ఇన్ని రోజులు రాజా సాబ్ చిత్రం మీద అంచనాలు పెద్దగా ఏమి లేవు. కానీ టీజర్ విడుదల అయ్యాక లెక్క వేరేగా ఉంటుందని, ఈమధ్య కాలం లో ఒక స్టార్ హీరోకి ఈ రేంజ్ టీజర్ కట్ పడలేదని, అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతారు అంటూ చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ టీజర్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు.
Also Read : మా నాన్న చనిపోయినందుకు నాకు ఏడుపు రాలేదు – తమన్