https://oktelugu.com/

Anchor Shyamala : యాంకర్ శ్యామల చీకటి బాగోతం బయటపెడతా అంటున్న టీడీపీ నేత… ముదిరిన వివాదం!

అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల ఏపీ సీఎం జగన్ అనుకూలంగా, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా మాటాడారు. ఈ క్రమంలో టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనూష ఫైర్ అయ్యింది. ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అన్నారు.

Written By: , Updated On : May 6, 2024 / 02:39 PM IST
TDP leader's harsh comments on Anchor Shyamala

TDP leader's harsh comments on Anchor Shyamala

Follow us on

Anchor Shyamala : యాంకర్ శ్యామలపై టీడీపీ మహిళా నేత మండిపడింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల గురించి మాట్లాడితే చీకటి బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా శ్యామలను దుయ్యబట్టింది. యాంకర్ శ్యామల ఇటీవల ఏపీలో పర్యటించారు. ఆమె వైసీపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి వంగ గీతను గెలిపించాలని శ్యామల అభ్యర్ధించారు. గడపగడపకు తిరిగి ప్రచారం చేశారు. అలాగే మరికొందరు వైసీపీ అభ్యర్థులకు ఆమె తన మద్దతు తెలిపారు.

అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల ఏపీ సీఎం జగన్ అనుకూలంగా, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా మాటాడారు. ఈ క్రమంలో టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనూష ఫైర్ అయ్యింది. ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అన్నారు. తెలంగాణాలో షర్మిల పార్టీ పెడితే… ఆమెను కలిసి పార్టీ కండుగా కప్పుకుంది. షర్మిల జెండా ఎత్తేయడంతో ఏపీకి వచ్చి వైసీపీ పార్టీలో చేరింది.

హైదరాబాద్ లో ఉండే నీకు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసు. నష్టపోయింది మేము. అనుభవించింది మేము. టీవీ షోలు, సినిమా ఈవెంట్లు చేసుకుంటూ ఉండక నీకు రాజకీయాలు అవసరమా. ఇంకోసారి పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబుల గురించి తప్పుగా మాట్లాడితే… నీ చీకటి బాగోతం బయటపెడతాను.మీ ఆయన చేసిన నేరాల గుట్టు విప్పుతాను. నిజాలు చెబుతాము. నీలా కథలు కాదని… ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఉండవల్లి అనూష కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా పవన్ కళ్యాణ్ తరపున జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు మెగా హీరోలు ప్రచారం నిర్వహిస్తున్నారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవతో పాటు పలువురు బుల్లితెర సెలెబ్రిటీలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఇక మెగా హీరోలు అయిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పిఠాపురంలో ఎన్నికల క్యాంపైన్ చేశారు. నాగబాబుతో పాటు ఆయన సతీమణి పద్మజ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విశేషం…