Homeట్రెండింగ్ న్యూస్Drunk Man Shouting Slogans: 90 ఎంఎల్ నరనరాల్లోకి వెళ్లి.. దేశభక్తి పొంగు కొచ్చింది! వామ్మో...

Drunk Man Shouting Slogans: 90 ఎంఎల్ నరనరాల్లోకి వెళ్లి.. దేశభక్తి పొంగు కొచ్చింది! వామ్మో మామూలు వీడియో కాదిదీ!

Drunk Man Shouting Slogans: తాగిన వాళ్ళు అబద్ధాలు చెప్పరు అంటారు. అలాగే అతిగా తాగిన వాళ్లు ఆవేశాన్ని ఆపుకోలేరు అంటారు. ఈ వీడియో చూస్తే అలానే అనిపిస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి అతిగా మద్యం తాగి కనిపిస్తున్నాడు. పైగా రోడ్డుమీదికి వచ్చాడు.. పోలీసులు ఊరుకోరు కదా.. వెంటనే బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేశారు. మనవాడు తాగిన మద్యం దెబ్బకు బ్రీత్ అనలైజర్ రికార్డు స్థాయిలో రీడింగ్ చూపించింది. ఇంకేముంది పోలీసులు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

అసలు తాగి ఉన్నాడు.. పైగా విపరీతమైన మత్తులో ఉన్నాడు. దీంతో తనను పట్టుకున్న పోలీసుల మీదకు దూకుడుగా వెళ్ళాడు. అంతేకాదు.. వందేమాతరం అంటూ నినాదాలు చేశాడు. నన్ను అదుపులోకి తీసుకోవడానికి మీరు ఎవరు అన్నట్టుగా స్వాతంత్ర సమరయోధుడి లాగా బిల్డప్ ఇచ్చాడు. చేయి పైకి ఎత్తి నినాదాలు చేశాడు. అంతటితో ఆగకుండా నేను టాక్స్ పేయర్ ను.. నన్ను అదుపులోకి తీసుకుంటారా అంటూ పోలీసులను ఉల్టా ప్రశ్నించాడు.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ సోషల్ మీడియాని మాత్రం ఊపేస్తోంది. సాధారణంగా మద్యం తాగిన వారు పోలీసుల పై ఎదురు తిరగడానికి సాహసం చేయరు. తను ఇతడు పీకల దాకా మద్యం తాగి.. ఆ మత్తులో రెచ్చిపోయాడు.. పోలీసుల మీద వీరంగం చేశాడు. తనను తాను ఒక స్వాతంత్ర సమరయోధుడిగా చెప్పుకుంటూ బిల్డప్ ఇచ్చాడు.

ఈ వీడియో ఇప్పటికే లక్షలలో వీక్షణలు సొంతం చేసుకుంది.”90ml మందు కడుపులో పడితే చాలు ప్రతివాడు ఇలాగే రెచ్చిపోతాడు. ఇటువంటివారిని పోలీసు అకాడమీలో వేసి ట్రైనింగ్ ఇప్పించాలి. మండుటెండలో పరుగులు పెట్టించాలి. అప్పుడు గాని తాగి రోడ్లమీదకి వస్తే ఏమవుతుందో అర్థమవుతుంది. 90 ఎంఎల్ ఒంట్లోకి వెళ్లడమే ఆలస్యం ఇతడికి ఒక్కసారిగా దేశభక్తి గుర్తొచ్చింది. ఇటువంటి దేశభక్తులను పోలీసులు అసలు వదిలిపెట్టకూడదు. వీరికి ఎప్పటికప్పుడు ఘనమైన సన్మానం చేస్తే గొప్పగా ఉంటుందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper
Exit mobile version