Devara : గత ఏడాది ఎన్టీఆర్(Junior NTR) నటించిన ‘దేవర'(Devara Movie) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. #RRR తర్వాత వస్తున్న సినిమా కావడంతో, రాజమౌళి(SS Rajamouli) తో సినిమా చేసిన హీరో మరుసటి సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, ‘దేవర’ చిత్రం పరిస్థితి కూడా అంతే అంటూ సోషల్ మీడియా లో పలువురు విశ్లేషకులు కామెంట్స్ చేసారు. కానీ విడుదల తర్వాత అలాంటి సెంటిమెంట్స్ కి బ్రేక్ చెప్పేసాడు ఎన్టీఆర్. ఈ చిత్రం ఆరంభం లో కాస్త డివైడ్ టాక్ తోనే మొదలైనప్పటికీ, ఆ తర్వాత మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చడంతో బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ రన్ ని సొంతం చేసుకొని దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం థియేటర్స్ లోనే కాదు నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : జపాన్ లో గ్రాండ్ గా విడుదల కానున్న ఎన్టీఆర్ ‘దేవర’..ప్రొమోషన్స్ మొదలెట్టిన మూవీ టీం!
సుమారుగా 9 వారాల పాటు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అయ్యింది. గ్లోబల్ వైడ్ గా కూడా ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా చూసారు. ఎన్టీఆర్ కి మొదటి నుండి జపాన్ దేశంలో మంచి క్రేజ్ ఉన్నందున ఈ చిత్రాన్ని ఈ నెల 27వ తారీఖున జపాన్ దేశంలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అయితే విడుదలకు ముందు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ప్రీమియర్ షోస్ సెలెక్టెడ్ మీడియా కి స్క్రీనింగ్ చేసి చూపించారు. వాళ్ళ నుండి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో థియేటర్స్ లోకి పూర్తి స్థాయిలో విడుదల అయ్యేలోపే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సినిమాగా దేవర నిల్చింది. ఈ పాజిటివ్ రెస్పాన్స్ 27 న విడుదల అవ్వబోయే సినిమాకు చాలా ప్లస్ అవుతుంది అని చెప్పొచ్చు.
2023 వ సంవత్సరం లో రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రాన్ని జపాన్ లో గ్రాండ్ గా విడుదల చేసారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. సుమారుగా 40 మిలియన్ల జపనీజ్ డాలర్స్ ని ఫుల్ రన్ లో రాబట్టిన ఈ సినిమాకి మొదటి రోజు కూడా ఆల్ టైం రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి. మరి ‘దేవర’ చిత్రానికి కూడా ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి. ప్రీమియర్స్ నుండి వస్తున్న పాజిటివ్ వేవ్స్ ని చూస్తుంటే ఈ చిత్రం జపాన్ లో ప్రభంజనం సృష్టించేలా అనిపిస్తుంది. ఒకవేళ ఈ చిత్రానికి జపాన్ లో మంచి రెస్పాన్స్ వస్తే చైనా లో కూడా డబ్ చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. చూడాలి మరి ఇండియన్ మార్కెట్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న దేవర, ఇంటర్నేషనల్ మర్కెట్స్ లో ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకోబోతుందో అనేది.
Also Read : దేవర 2′ గురించి అభిమానులకు సెన్సేషనల్ అప్డేట్..షూటింగ్ ప్రారంభం తేదీ ఖరారు!