Homeఎంటర్టైన్మెంట్Nani Bloody Romeo Movie Update: 'బ్లడీ రోమియో' చిత్రం శాశ్వతంగా ఆగిపోయినట్టేనా.. ? 'ప్యారడైజ్'...

Nani Bloody Romeo Movie Update: ‘బ్లడీ రోమియో’ చిత్రం శాశ్వతంగా ఆగిపోయినట్టేనా.. ? ‘ప్యారడైజ్’ కోసం నాని త్యాగం..

Nani Bloody Romeo Movie Update: నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఒప్పుకొని , తన కెరీర్ లోనే పెద్ద తప్పు చేశాడా?, ఈ సినిమా ఆయన సమయాన్ని చాలా వరకు వృధా చేస్తుందా ? అనే అనుమానాలు నాని అభిమానుల్లో , మూవీ లవర్స్ లో కలుగుతున్నాయి. నాని సినీ కెరీర్ ని ‘దసరా’ కి ముందు , ఆ తర్వాతగా డివైడ్ చేయొచ్చు. అప్పటి వరకు మామూలు జానర్ సినిమాలు చేస్తూ […]

Nani Bloody Romeo Movie Update: నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఒప్పుకొని , తన కెరీర్ లోనే పెద్ద తప్పు చేశాడా?, ఈ సినిమా ఆయన సమయాన్ని చాలా వరకు వృధా చేస్తుందా ? అనే అనుమానాలు నాని అభిమానుల్లో , మూవీ లవర్స్ లో కలుగుతున్నాయి. నాని సినీ కెరీర్ ని ‘దసరా’ కి ముందు , ఆ తర్వాతగా డివైడ్ చేయొచ్చు. అప్పటి వరకు మామూలు జానర్ సినిమాలు చేస్తూ వచ్చిన నాని , ఈ సినిమా తో వేరే లెవెల్ కి వెళ్లే ప్రయత్నం చేసాడు. అనుకున్నట్టుగానే ఆ సినిమా సక్సెస్ అయ్యింది , ఆ తర్వాత నాని చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ‘దసరా’ తో తన స్థాయిని పెంచిన డైరెక్టర్ కావడం తో శ్రీకాంత్ ఓదెల ని బలంగా నమ్మాడు నాని.

అలా నమ్మి ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతలా కష్టపడ్డాడో , ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి ఇవ్వడానికి ఆయన ఏమేమి చేస్తున్నాడో మన కళ్ళకు కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ‘ఆయా షేర్’ సాంగ్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసి , తన టాలెంట్, కసి ఈ సినిమా కోసం ఎలా ఖర్చు చేస్తున్నాడో అందరికీ అర్థం అయ్యింది. ఈ సినిమా కథ పై చాలా బలమైన నమ్మకం పెట్టుకోవడం వల్లే, సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆడియన్స్ లో ఈ చిత్రం పై కావాల్సినంత హైప్ , క్రేజ్ ఉంది. కానీ వరుస వాయిదాలు కారణంగా ఈ చిత్రం పై హైప్ డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో , ఆగస్టు 21 కి వాయిదా వేశారు.

ఇప్పుడు ఆ తేదీ నుండి కూడా ఈ సినిమా వాయిదా పడింది , షూటింగ్ పూర్తి అవ్వడానికి మరో 60 రోజుల సమయం ఉంది. మరో పక్క ‘ఓజీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తీసి , యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుజిత్ , నాని కోసం ‘బ్లడీ రోమియో’ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రెడీ గా ఉన్నాడు. కానీ నాని మాత్రం అందుబాటులో లేడు . రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లొకేషన్స్ ని రెక్కీ చేయడం కోసం లండన్ కి కూడా వెళ్ళాడు సుజిత్. అయితే ఇంతలోపే పవన్ కళ్యాణ్ నుండి సుజిత్ కి ఫోన్ వచ్చింది. ‘ఓజీ 2’ కోసం డేట్స్ అడిగావు కదా, నేను ఈ ఏడాది లోనే డేట్స్ ఇవ్వడానికి సిద్ధం , ఇండియా కి వచ్చినప్పుడు కలవు అని అన్నాడట. ఇప్పుడు సుజిత్ తన ద్రుష్టి మొత్తాన్ని ‘ఓజీ 2’ కి షిఫ్ట్ చేశాడు. దీంతో ‘బ్లడీ రోమియో’ పరిస్థితి ఏంటి?, పూర్తిగా ఆగిపోయినట్టేనా?, ‘ది ప్యారడైజ్’ కోసం నాని ఈ చిత్రాన్ని త్యాగం చేశాడా ?, ఆ త్యాగానికి తగ్గ ఫలితం ‘ప్యారడైజ్’ ఇస్తుందో లేదో చూడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper