Homeఎంటర్టైన్మెంట్Anirudh taking special care in Paradise: ప్యారడైజ్ విషయంలో అనిరుధ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడా..?...

Anirudh taking special care in Paradise: ప్యారడైజ్ విషయంలో అనిరుధ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడా..? కారణం ఏంటంటే..?

Anirudh taking special care in Paradise: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. పాన్ ఇండియా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రతి ఒక్క ప్రేక్షకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపే ఆసక్తిగా చూస్తున్నారు. మన తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇతర భాషల హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తుండటం విశేషం… ఇక ప్రేక్షకులు సైతం తెలుగు నుంచి స్టార్ హీరోల సినిమాలు […]

Anirudh taking special care in Paradise: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. పాన్ ఇండియా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రతి ఒక్క ప్రేక్షకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపే ఆసక్తిగా చూస్తున్నారు. మన తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇతర భాషల హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తుండటం విశేషం… ఇక ప్రేక్షకులు సైతం తెలుగు నుంచి స్టార్ హీరోల సినిమాలు వస్తే చూడాలి అని చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చూస్తున్న ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. అలాగే ప్రేక్షకులు ఆ సినిమాలను ఓన్ చేసుకొని వాళ్లకు వీరాభిమానులుగా మారిపోయారు… ఇక ఇలాంటి క్రమంలోనే మన తెలుగు సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ ని అందిస్తుండడం విశేషం…తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన అనిరుధ్ తెలుగులో స్టార్ హీరోల సినిమాలకి ఎక్కువగా అవకాశాలునైతే అందుకుంటున్నాడు.

కారణం ఏంటి అంటే ఆయన మ్యూజిక్ లో కొత్తదనం ఉండటమే కాకుండా ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా అతని మ్యూజిక్ ఉంటుంది. ఇక దాంతో పాటుగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ప్రతి సీన్ ఎలివేట్ అవ్వడంలో అనిరుధ్ తీవ్రంగా శ్రమించి మరి బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నాడు. దానివల్ల స్టార్ హీరోలందరు అతన్ని పెట్టుకొని సినిమాలు చేద్దామని దర్శకులకు సలహాలైతే ఇస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మీద అనిరుధ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటివరకు చాలా బాగా వచ్చిందట. దాంతో అనిరుధ్ సైతం ఈ సినిమా స్టోరీ కూడా బాగుంది. కాబట్టి తనకు కూడా పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకొని మరి ట్యూన్స్ అయితే అందిస్తున్నాడు.

ఈనెల 24వ తేదీన ఈ సినిమా నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. దాంతో పాటుగా ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అతను స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గ్లింప్స్ లో రిలీజ్ చేసిన బ్యా గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దానిని మించిన బ్యా గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఉంటుందంటూ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper