Homeఎంటర్టైన్మెంట్వినూత్న హీరో దర్శకత్వ ప్రయోగాలు !

వినూత్న హీరో దర్శకత్వ ప్రయోగాలు !

హీరో నిఖిల్ కి వినూత్నమైన సినిమాలు చేస్తాడనే మంచి పేరు ఉంది. అయితే, ఈ హీరోకి ఎప్పటినుండో ఒక కోరిక ఉంది, ఎప్పటికైనా రెగ్యులర్ దర్శకుడిగా మారాలనేది ఆ కోరిక. డైరక్టర్ గా మారి కమర్షియల్ సినిమా మాత్రం చేయను అంటున్నాడు నిఖిల్. గత ఏడాదిలో చిన్న పిల్లలతో ఓ ప్రయోగాత్మక సినిమా తీస్తున్నాను అంటూ ఓ ప్రయోగానికి శ్రీకారం కూడా చుట్టాడు. మరీ, ఆ సినిమా ఏమైందో ఏమో తెలియదు, మళ్ళీ మరో సినిమాని దర్శకుడిగా […]

హీరో నిఖిల్ కి వినూత్నమైన సినిమాలు చేస్తాడనే మంచి పేరు ఉంది. అయితే, ఈ హీరోకి ఎప్పటినుండో ఒక కోరిక ఉంది, ఎప్పటికైనా రెగ్యులర్ దర్శకుడిగా మారాలనేది ఆ కోరిక. డైరక్టర్ గా మారి కమర్షియల్ సినిమా మాత్రం చేయను అంటున్నాడు నిఖిల్. గత ఏడాదిలో చిన్న పిల్లలతో ఓ ప్రయోగాత్మక సినిమా తీస్తున్నాను అంటూ ఓ ప్రయోగానికి శ్రీకారం కూడా చుట్టాడు.

మరీ, ఆ సినిమా ఏమైందో ఏమో తెలియదు, మళ్ళీ మరో సినిమాని దర్శకుడిగా మొదలుపెట్టలేదు. వచ్చే ఏడాది అడవి నేపథ్యంలో గిరిజనుల మీద ఒక విభిన్నమైన సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అసలు దర్శకుడిగా మారాల్సిన అవసరం నిఖిల్ కి లేదు. అయితే, ఇంతకుముందు హైదరాబాద్ నవాబ్ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన అనుభవం ఈ హీరోకి ఉంది.

ఆ అనుభవంతోనే డిఫరెంట్ సినిమాలు తీయాలని తెగ ఉబలాట పడుతున్నాడు. ప్రస్తుతం అడవి సినిమాకి సంబంధించి కథాచర్చలు జరుగుతున్నాయని, దర్శకుడు చందు మొండేటి ఈ స్క్రిప్ట్ లో హెల్ప్ చేస్తున్నాడని తెలుస్తోంది. నిఖిల్ హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. నిఖిల్ చేతిలో 18-పేజెస్, కార్తికేయ-2 సినిమాలతో పాటు మరో రెండు చిత్రాలు కూడా ఉన్నాయి.

అయినా నిఖిల్ మాత్రం దర్శకత్వ ఆలోచనలతోనే ప్రస్తుతం కుస్తీ పడుతున్నాడు. గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ హీరో, మరీ తన వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయకుండా దర్శకుడిగా మారడానికి టైం స్పెండ్ చేయడం ఏమిటో ఏంటో !

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper