Telugu Hero Hindi Director: మన టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ లేదా, కోలీవుడ్ హీరోలతో సినిమాలు చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ బాలీవుడ్ లేదా కోలీవుడ్ దర్శకులు మన తెలుగు హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్స్ మన టాలీవుడ్ క్రేజీ స్టార్ హీరోలతో చేతులు కలిపినప్పుడల్లా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఉదాహరణ రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ చిత్రం ‘వార్ 2′(War 2 Movie). భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. హిందీ వెర్షన్ వసూళ్లు ఈ వీకెండ్ వరకు బాగానే ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ, తెలుగు వెర్షన్ వసూళ్లు మాత్రం డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో ఉన్నాయి.
Also Read: ఆ బాలీవుడ్ హీరోయిన్ కారణంగానే రామ్ చరణ్,అల్లు అర్జున్ మధ్య గొడవలు పుట్టాయా?
గతం లో కూడా హిందీ డైరెక్టర్స్ తో సినిమాలు తీసి మన టాలీవుడ్ క్రేజీ స్టార్స్ ఇలాగే చేతులు కాల్చుకున్నారు. వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కూడా ఒకడు. అప్పట్లో రచ్చ, నాయక్ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ తో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్న రామ్ చరణ్, బాలీవుడ్ లోకి ‘జంజీర్’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు లో ఈ చిత్రం ‘తుఫాన్’ పేరుతో విడుదలైంది. హిందీ లో కంటే పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహించాడు. ఇలా బాలీవుడ్ దర్శకులను నమ్మి మోసపోయిన వారిలో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కూడా ఉన్నాడు. ఓం రౌత్ దర్శకత్వం లో ఆయన హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన కళ్లారా చూశాము.
వీళ్లందరి సంగతి కాసేపు పక్కన పెడితే, బాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టిన ఒకే ఒక్క తెలుగు హీరో ఉన్నాడు. ఆయన మరెవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). అప్పట్లో ఆయన హీరో గా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని హిందీ ఆయనే హీరో గా ‘ఆజ్ కా గూండా రాజ్’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా బాలీవుడ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, ఆ ఏడాది బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 గ్రాసర్స్ లో ఒకటి గా నిల్చింది. ఇక ఆ తర్వాత శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘జెంటిల్ మ్యాన్’ చిత్రాన్ని బాలీవుడ్ లో చిరంజీవి అదే పేరుతో రీమేక్ చేశాడు. మహేష్ భట్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఈ రెండు సినిమాల కంటే ముందు ఆయన రాజశేఖర్ అంకుశం చిత్రాన్ని బాలీవుడ్ లో ‘ప్రతిబంద్’ పేరుతో రీమేక్ చేశాడు. ఈ చిత్రం కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. అలా మెగాస్టార్ బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తే రెండు సినిమాలు కమర్షియల్ గా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.