Vijay Deverakonda Kingdom Updates: తెలుగు సినిమా ఇండస్ట్రిలో వరుసగా భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈరోజు ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే దక్కుతున్నాయి. ఇక వచ్చేవారం కింగ్ డమ్(Kingdom) సినిమాతో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రేక్షకులు అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయ్ కి ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజుల నుంచి విజయ్ అసలు ఏమాత్రం తన ఫామ్ ను కొనసాగించలేకపోతున్నాడు. వరుసగా డిజాస్టర్ లను ఎదుర్కొంటున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి రాబోయే సినిమా మంచి విజయాన్ని సాధిస్తే చూడాలని అతని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ప్రస్తుతం ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న విజయ్ ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్న విజయ్ ఈ సినిమాతో ఎలాగైనా సరే మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…
Also Read: హరిహర వీరమల్లు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
దాంతోపాటుగా ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ అయిన జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నాడట. ఆయన వాయిస్ ఓవర్ తోనే ఈ సినిమాకి టీజర్ అయితే రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయిన నాగవంశీకి ఎన్టీఆర్ మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది.
కాబట్టి నాగవంశీ మీద ఉన్న ఇష్టం తోనే ఈ సినిమాలో ఒక చిన్న గెస్ట్ అప్పిరియన్స్ అయితే ఇచ్చారట. అది ఈ సినిమాలో హై వోల్టేజ్ ఇస్తుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి…ఈ న్యూస్ కనుక నిజమైతే విజయ్ దేవరకొండ ఖాతాలో భారీ సక్సెస్ పడటమే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరు ఇద్దరికి ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకంగా మారబోతోంది.
Also Read: ఒక్క సీన్ చెప్పి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పేశాడుగా..?
గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) ఇప్పటివరకు సాఫ్ట్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఒకసారిగా మాస్ అవతారం ఎత్తడంతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…