ఎంటర్టైన్మెంట్Rashmi Gautam: నాకు అలాంటివాడే మొగుడు కావాలన్న రష్మీ... వద్దులే చచ్చిపోతావ్ అంటూ హైపర్ ఆది...

Rashmi Gautam: నాకు అలాంటివాడే మొగుడు కావాలన్న రష్మీ… వద్దులే చచ్చిపోతావ్ అంటూ హైపర్ ఆది పంచ్!

Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ కి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. అమ్మడు వయసు 35కి పైనే. అయితే పెళ్లి మాటెత్తడం లేదు. దానికి ఇంకా సమయం ఉందంటుంది. యాంకర్ గా బిజీగా ఉన్న రష్మీ ఆలోచన చేయడం లేదు. అయితే ప్రేమ పుకార్లు జోరుగా వినిపిస్తుంటాయి. రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేమికులుగా ప్రచారమయ్యారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. జబర్దస్త్, ఢీ షోస్ వేదికగా విచ్చలవిడిగా ప్రేమించుకుంటున్నారు. పలుమార్లు ఉత్తుత్తి పెళ్లి, శోభనం జరుపుకున్నారు.

అయితే ఇదంతా ఆన్ స్క్రీన్ వరకే… ఆఫ్ స్క్రీన్ లో మేము మిత్రులం మాత్రమే అంటారు. సుధీర్-రష్మీ గౌతమ్ ప్రేమ పుకార్లను పలుమార్లు ఖండించారు. అయితే జనాల్లో ఒక అనుమానం అయితే ఉంది. సుధీర్ మల్లెమాలను వీడినప్పటి నుండి రష్మీతో కనపించింది లేదు. రష్మీతో పాటు సుధీర్ కి కూడా పెళ్లి కాలేదు. ఈ క్రమంలో ఏదో ఒక రోజు సడన్ గా బాంబు పేల్చుతారేమో అనే సందేహాలు ఉన్నాయి.

తాజాగా రష్మీ గౌతమ్ తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పింది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ లో జడ్జి ఇంద్రజ రష్మీని ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావని అడిగింది. నీకు కాబోయేవాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాలని కోరింది. ఈ ప్రశ్నకు రష్మీ గౌతమ్ ఒకింత సిగ్గు పడింది. ‘వాడి మాటలు యాక్షన్ తో చూపించాలి, యాక్షన్ మాటలతో సింక్ అవ్వాలి అని చెప్పింది. దానికి హైపర్ ఆది ‘వాడు వేరే ఛానల్ లో ఉండాలి’ అని పంచ్ వేశాడు. ఇంకా మాట్లాడుతూ రష్మీ… చేసిందే చెప్పాలి. చెప్పిందే చేయాలి, అని చెప్పింది.

వాడు చేసినవన్నీ చెబితే చచ్చిపోతావ్ వద్దులే అని హైపర్ ఆది పంచ్ వేశాడు. రష్మీ చెప్పిన లక్షణాలను సుధీర్ కి అన్వయిస్తూ హైపర్ ఆది రష్మీ మీద పంచ్లు వేశారు. ఇక రష్మీ గౌతమ్ కాబోయేవాడి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వర్ష, సౌమ్యరావు సైతం తమకు కాబోయేవాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పడం విశేషం. మరి రష్మీకి అలాంటి వాడు దొరుకుతాడో లేదో చూడాలి.

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Manchu Lakshmi: మీకు నచ్చిన డ్రస్సులే వేసుకోండి అంటూ శివాజీ పై మంచు లక్ష్మి కౌంటర్లు..

Manchu Lakshmi: ప్రముఖ హీరో శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తులపై చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా రోజులుగా ఈ అంశంపై వివిధ కోణాల్లో చర్చలు జరుగుతూ...

Rashmi Gautam: తప్పకుండా అనుభవిస్తారు.. వైసీపీ నేతపై విరుచుకుపడిన యాంకర్ రష్మి

Rashmi Gautam: బుల్లితెర నటులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వ్యతిరేకంగా గళం వినిపిస్తుంటారు. ముఖ్యంగా జబర్దస్త్ నటులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అనే ముద్రను మూట కట్టుకున్నారు. మెగా కుటుంబంతో...

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Oktelugu Epaper