Samantha: సమంత బాడీ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. అందంలోనూ అమ్మడు బరువులు మోయడంలో బాగా అరితేరిపోయింది. అయినా ఎన్ని బరువులు ఎత్తకపోతే సామ్ ఈ స్థాయికి వచ్చి ఉంటుంది. తాజాగా 80 కిలోల బరువు ఎత్తి.. మొత్తానికి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు చూడటానికి సన్నగా.. నాజూగ్గా కనిపించే సమంత 80కిలోల బరువును ఎలా ఎత్తింది ? పైగా అలవోకగా ఎత్తింది. అన్నట్టు ఇందుకు సంబంధించిన వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

తన జిమ్ వర్కవుట్‌లో భాగంగా ఆమె వరుసగా 75కిలోలు, 78కిలోలు, 80కిలోల బరువును ఎత్తింది. ‘లెవల్ అప్’ ఛాలెంజ్ పేరుతో సామ్ ఈ వీడియోలను తన అభిమానులతో పంచుకుంది. వీడియోలతో పాటు ఒక మెసేజ్ కూడా షేర్ చేసింది పాప. ‘నా ట్రైనర్ జునైద్ షేక్ తనకు ఛాలెంజ్ చేశాడు. నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా’ అంటూ అమ్మడు ఛాలెంజ్ విసిరింది. ఇక హీరోయిన్ గా సమంత ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడాకుల వ్యవహారం, అలాగే సామ్ ఎఫైర్లు అంటూ వచ్చిన లేనిపోని పుకార్లు, ఇక ఆ పుకార్ల ప్రభావం నుంచి సమంత ఇప్పుడిప్పుడే బయట పడుతుంది.
Also Read: బ్రహ్మ ముహూర్తం సమయంలో ఇలా చేస్తే మీ కోరికలు తీరడం ఖాయం!
ఒక విధంగా తన జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం నుంచి సమంత చాలా త్వరగా బయటపడినట్టే. ఏది ఏమైనా తన జీవితంలో వచ్చిన అనేక ఇబ్బందులకు సంబంధించి ఆమె రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది. ‘మీతో మీరు మీలో మీరు నిజాయితీగా ఉండండి’ అంటూ ఓ భావోద్వేగమైన మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమంత ఈ సందేశాన్ని ఎందుకు పోస్ట్ చేసిందా అని ఆరా చైతుని ఉద్దేశించే పోస్ట్ చేసిందని తెలుస్తోంది.
ఏది ఏమైనా 2021 సంవత్సరం సమంతకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం. అందుకే, పాత జ్ఞాపకాలన్నిటినీ మరచిపోవాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో బాధలన్నిటినీ మర్చిపోయింది. మరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే, గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేయాలి కదా. కాబట్టి వదిలేసింది. ఊరికినే వదిలేస్తే ఏం బాగుంటుంది. అందుకే, తన ఇన్ స్టా అకౌంట్ లో తన బలం ఏమిటో చూపిస్తూ వీడియోలను షేర్ చేసింది.
Also Read: కులాంతర వివాహాలు చేసుకున్న మన టాలీవుడ్ హీరోలు వీరే..
[…] Aamir: బాలీవుడ్ లో నేటి క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ వ్యక్తి పై సిటీ సివిల్ కోర్టులో కేసు పెట్టడం అందరికి షాక్ ఇచ్చింది. అసలు సల్మాన్ ఎవరి పై కేసు పెట్టాడు ? ఎందుకు పెట్టాడు ? అంటే.. మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలతో తన పరువు తీస్తున్నాడంటూ కేతన్ కక్కడ్ పై సల్మాన్ ఖాన్ పరువునష్టం దావా వేశాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ప్రసారం కాకుండా స్టే ఇవ్వాలని, ఆయా మాధ్యమాల్లో తనను అవమానపర్చేలా ఉన్న కంటెంట్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని సల్మాన్ ఖాన్ కోరుతూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. […]