Nithya Menen: కేరళ కుట్టి నిత్యా మీనన్ మంచి నటి. అద్భుతంగా నటించగలదు. కానీ, అవకాశాలే ఎక్కువ రావు. వచ్చినా చిన్నాచితకా సినిమాలే. అందుకే, నిత్యా మీనన్ మనసు ఇక పెళ్లి వైపుకు వెళ్ళిందని, ఎలాగూ సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి, త్వరలో పెళ్లి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుందని వార్తలు వచ్చాయి.
అయితే, తన పెళ్లి పై నిత్యా మీనన్ క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “నా పెళ్లి గురించి ఇటీవల వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదు. అలాగే నేను ప్రేమలో ఉన్నాను అంటూ వచ్చిన వార్తలు కూడా పూర్తిగా కల్పితం” అని నటి నిత్యా మీనన్ స్పష్టం చేసింది. మొత్తానికి తన పెళ్లి విషయమై ఇటీవలే వచ్చిన వదంతులపై ఈ భామ స్పందించింది.
Also Read: Bimbisara Pre Release Event- NTR: వస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. నందమూరి ఫ్యాన్స్ కి పండుగే
మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ? అని అడిగితే.. పెళ్లి గురించి తనకు ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన, ప్రణాళిక లేదు అని ఆమె తెలిపింది. నిజానికి ఆ మధ్య ఒక యంగ్ హీరోతో నిత్యా చాన్నాళ్లు డేటింగ్ చేసింది. నిత్యా కూడా ఈ విషయాన్నీ ఆ మధ్య ఇన్ డైరెక్ట్ గా బయటపెట్టిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కానీ, ఆ యంగ్ హీరో ఆల్ రెడీ పెళ్లి చేసుకున్నాడు. అందుకే నిత్యా మీనన్ ఆ బంధాన్ని వదులుకుంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా కొనసాగాలని నిత్యా మీనన్ ప్లాన్ చేసుకుంది. కానీ, ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే లేవు. అందుకే మధ్యలో నిర్మాతగా కూడా మారింది.
కానీ, నిత్యా మీనన్ నిర్మించిన ‘స్కైలాబ్’ సినిమా డిజాస్టర్ అయింది. మొత్తానికి నిత్య మీనన్ నిర్మాతగా కూడా ఫెయిల్ అయింది.
Also Read:Macherla Niyojakavargam: నితిన్ పొలిటికల్ డ్రామా.. ‘మాచర్ల దమ్కీ’ ఇచ్చాడుగా
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Heroine nithya menen shares a video clarifying about her marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com