Nithyananda Swami: దేశంలో వివాదాస్పద స్వామిజీగా గుర్తింపు పొందిన నిత్యానంద చాలాకాలం తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యారు. నేను బతికే ఉన్నా అంటూ ఓ వీడియోను సోమవారం విడుదల చేశారు. నిత్యానంద చనిపోయినట్లు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఈ వీడియోలో ఖండించారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు.

నాలుగు నెలలుగా సమాధిలో..
నాలుగు నెలల క్రితం తాను సమాధిలోకి వెళ్లినట్లు నిత్యానంద తాజా వీడియోలో చెప్పుకొచ్చారు. నాలుగు నెలల నుంచి తాను చనిపోయినట్టు తప్పుడు వార్తలు వస్తున్నాయని తెలిపారు. తన వయస్సు 44 ఏళ్లని, గడిచిన నాలుగు నెలలుగా తాను సమాదిలో ఉన్నానని, చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పుకున్నారు. దేవుడి తనకు మరో జన్మ ఇచ్చారని, ఈ జన్మలో తాను చేసే పనులు ఎవరూ ఊహించలేరని పేర్కొన్నారు. తాను జనం కోసం చేస్తున్న మంచి పనులను ఎవరూ చేయలేరన్నారు. హిందువుల పరిరక్షణ కోసం మైక్రో ఫైనాన్స్ విధానం తీసుకొస్తున్నట్టు నిత్యానంద తెలిపారు. లక్ష రూపాయిల వరకు వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామంటూ నిత్యానంద సెన్సెషనల్ కామెంట్ చేశారు.
Also Read: Spiritual Tours: దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యటనలు.. భక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు

పది లక్షల మందితోత నిత్యానంద సేన..
అన్నిదేశాలలో కలిపి 10 లక్షల శివాలయాలు నిర్మిస్తామని స్వామి నిత్యానంద ప్రకటించారు. నిత్యానంద ఆర్మీలో చేరాలని యువతకి పిలుపునిచ్చారు. 10 లక్షల మందితో నిత్యానంద సేనని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధంచేసినట్టు చెప్పారు.
Also Read:Punugu Pilli Tailam: తిరుమల శ్రీవారికి పునుగుపిల్లి తైలంతో ఏం చేస్తారు? అసలేంటి కథ?