Homeఎంటర్టైన్మెంట్Divya Bharathi Comments On Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తీరు నన్ను చాలా బాధ...

Divya Bharathi Comments On Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తీరు నన్ను చాలా బాధ పెట్టింది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్!

Divya Bharathi Comments On Sudigali Sudheer: గాలోడు వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) సినిమాలకు కాస్త భారీ గ్యాప్ ఇచ్చాడు. రెండున్నర ఏళ్ళ క్రితం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే చిత్రాన్ని ప్రకటించాడు. పాగల్ మూవీ దర్శకుడు నరేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. అదే విధంగా ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి, అదే విధంగా మొదటి […]

Divya Bharathi Comments On Sudigali Sudheer: గాలోడు వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) సినిమాలకు కాస్త భారీ గ్యాప్ ఇచ్చాడు. రెండున్నర ఏళ్ళ క్రితం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే చిత్రాన్ని ప్రకటించాడు. పాగల్ మూవీ దర్శకుడు నరేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. అదే విధంగా ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి, అదే విధంగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘అయ్యో పాపం సారూ’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట అంత పెద్ద హిట్ అవుతుందని మూవీ టీం కూడా ఊహించలేదు. అప్పటి నుండి ఈ సినిమా కోసం సుధీర్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. అందుకు కారణం డైరెక్టర్ నరేష్ ఈ చిత్రం నుండి తప్పుకోవడమే. అతను వెళ్ళిపోయాక సినిమా ఆగిపోయింది.

దీంతో సుధీర్ కూడా ఈ చిత్రాన్ని పక్కన పెట్టి, తనకు వచ్చిన షోస్ కి యాంకరింగ్ చేసుకుంటూ, రీసెంట్ గానే ‘హైలెస్సా’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని మొదలు పెట్టాడు. అయితే కొత్త డైరెక్టర్ దొరకడం తో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ మూవీ షూటింగ్ కూడా మొదలైందని, త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయబోతున్నాము అంటూ అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఈ చిత్రం నుండి ఒక పాట ని కూడా విడుదల చేశారు. దీనిపై గతంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నరేష్ ఒక ట్వీట్ వేస్తూ ‘ఏమి లేబర్ వి రా నువ్వు. ఎడిటింగ్ లో తీసివేయబడిన షాట్స్ తో మిగిలిన సినిమా మొత్తం తీసి కాలం గడిపేలా ఉన్నావు. అసలు రెండవ హీరోయిన్ తో చెయ్యాల్సిన పాటను ఈ చిలక తో వదిలావ్. పోనీ మంచి ట్యూన్ అయినా పెట్టావా అంటే అది కూడా లేదు. స్టెప్పమ్ కొట్టి దప్పమ్ వేయనా? అనేది ఒక లిరిక్ నా?, ఈ ఒక్క మాటతో రెండు చేతులు గుండుపై పెట్టుకొని’ అని కామెంట్ చేస్తాడు.

దీనిపై ఆ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న దివ్య భారతి చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతూ రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఒక ఆడపిల్లని పట్టుకొని చిలక అని ఈ డైరెక్టర్ సంబోధిస్తున్నాడు. ఇదా ఒక మహిళను గౌరవించే తీరు. ఇతను కేవలం ఇప్పుడే కాదు, షూటింగ్ సెట్స్ లో కూడా నా పై, మహిళలపై ఎంతో నీచంగా కామెంట్స్ చేసేవాడు. బాధ కలిగించే విషయం ఏమిటంటే హీరో సుధీర్ కూడా ఇదంతా చూస్తూ సైలెంట్ గా ఉన్నాడే కానీ, డైరెక్టర్ పై నోరు మెదపలేదు’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper