Homeఎంటర్టైన్మెంట్అరె.. పెళ్లి కానీ హీరోలూ తొందరపడండి !

అరె.. పెళ్లి కానీ హీరోలూ తొందరపడండి !

గత ఏడాది లాక్ డౌన్ లో షూటింగ్ లకు గ్యాప్ రావడంతో పెళ్లి కానీ హీరోలలో రానా, నిఖిల్, నితిన్ లాంటి కొంతమంది పెళ్లి చేసుకుని బ్యాచరల్ లైఫ్ కి శుభం కార్డ్ వేశారు. ప్రస్తుతం ఆ హీరోలూ ఫ్యామిలీ మెన్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఇంకా పెళ్లి కానీ హీరోలు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. మళ్ళీ కరోనా సెకెండ్ వేవ్ తో షూటింగ్ లకు ఎలాగూ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి.. […]

Tollywood Heroesగత ఏడాది లాక్ డౌన్ లో షూటింగ్ లకు గ్యాప్ రావడంతో పెళ్లి కానీ హీరోలలో రానా, నిఖిల్, నితిన్ లాంటి కొంతమంది పెళ్లి చేసుకుని బ్యాచరల్ లైఫ్ కి శుభం కార్డ్ వేశారు. ప్రస్తుతం ఆ హీరోలూ ఫ్యామిలీ మెన్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఇంకా పెళ్లి కానీ హీరోలు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. మళ్ళీ కరోనా సెకెండ్ వేవ్ తో షూటింగ్ లకు ఎలాగూ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి.. ఇప్పుడంతా హీరోలకు ప్రీ టైమే. మరి ఈ ఖాళీ సమయాన్ని పెళ్ళికి కేటాయించొచ్చు. సో.. పెళ్లి కానీ హీరోలూ తొందరపడండి.

ఆ తొందరపడే హీరోల్లో మొదటి ప్లేస్ లో సాయి తేజే ఉండేలా కనిపిస్తున్నాడు. సోలో బతుకే సో బెటరూ అంటూ గత సినిమాతో ఏవరేజ్ హిట్ ను అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లిన తేజ్ కి, ఈ ఖాళీ టైం పెళ్ళికి మంచి అవకాశం. ఇప్పటికే తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని రూమర్స్ కూడా వచ్చాయి. ఎలాగూ టాలీవుడ్ లోని బ్యాచులర్ హీరోలు ఒక్కొక్కరూ పెళ్లి బాట పడుతున్నారు కాబట్టి ఈ సారి సాయి ధరమ్ తేజ్ వంతు వచ్చింది అనుకోవాలి.

పైగా పెళ్లి కూతురు గురించి రూమర్స్ కూడా వినిపించాయి. పెద్దలు కుదిర్చిన బంధువుల అమ్మాయినే సాయితేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ రూమర్స్ సారాంశం. కాగా ఈ అక్టోబర్ – నవంబర్ ల్లో తేజ్ పెళ్లి జరిగే అవకాశం ఉందట. ఇక పెళ్లి కానీ మిగిలిన హీరోల సంగతికి వస్తే.. ముందుగా ప్రభాస్ ఈ లిస్ట్ లో ముందువరుసలో ఉన్నాడు.

అలాగే తరుణ్, సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ, రామ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, శర్వానంద్ ఇలా లిస్ట్ పెద్డదే ఉంది. మరి ఈ హీరోలలో ఈ గ్యాప్ ను ఎంతమంది పెళ్ళికి ఉపయోగించుకుంటారో చూడాలి. ఈ సెకెండ్ వేవ్ మరో నాలుగు నెలలు కంటిన్యూ అయితే మాత్రం వీళ్లల్లో సగం మంది హీరోలు పెళ్లి పీటలెక్కే అవకాశం ఉంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper