Karthi: జపాన్ ప్లాప్.. కార్తీలో ఇన్ని మార్పులకు కారణమైందా?

గతంలో ఒక సినిమా విడుదలైన తర్వాత.. మరో సినిమాను పట్టాలు ఎక్కించే కార్తీ.. జపాన్ ఫలితం తర్వాత ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కార్తీ నలన్ కుమారస్వామి దర్శకత్వంలో నటిస్తున్నాడు.

Written By: Velishala Suresh, Updated On : March 10, 2024 5:02 pm

Karthi

Follow us on

Karthi: కార్తీ.. తెలుగు, తమిళంలో సమానమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న నటుడు. యుగానికి ఒక్కడు, ఆవారా, ఊపిరి, నా పేరు శివ, ఖైదీ వంటి సినిమాలతో ఇక్కడ ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన నటుడిగా మారిపోయాడు. అయితే ఇటీవల తన 25వ చిత్రం జపాన్ కార్తీ ఆశలను అడియాసలు చేసింది. ఈ సినిమాపై అతడు భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. కానీ అది డిజాస్టర్ గా మిగిలింది. నిర్మాతకు భారీగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా ఫలితం కార్తీ లో చాలా మార్పులకు కారణమైందని తమిళ ప్రేక్షకులు అంటున్నారు.

గతంలో ఒక సినిమా విడుదలైన తర్వాత.. మరో సినిమాను పట్టాలు ఎక్కించే కార్తీ.. జపాన్ ఫలితం తర్వాత ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కార్తీ నలన్ కుమారస్వామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇది కార్తీకి 26వ చిత్రం. ఇంతకుముందు కుమారస్వామి సూదుకవ్వుమ్, కాదలుమ్ కడందు పోగుమ్ వంటి చిత్రాలను తెరకెక్కించాడు.. అవి రెండు కూడా తమిళ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. కార్తీ 26వ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనిని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే తమిళ ఇండస్ట్రీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 50% పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ దృశ్యాలు, షూటింగ్ విషయాలతో కలిపి ఓ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. .

నలన్ కుమారస్వామి తో సినిమా ముగిసిన తర్వాత మిగతా ఆరు చిత్రాలను త్వరగా కంప్లీట్ చేయాలని కార్తీ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ చిత్రాలకు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తమిళంలో ఏ హీరో చేతిలో కూడా ఇన్ని సినిమాలు లేవు. ప్రామిసింగ్ హీరోగా ముద్రపడటం, నిర్మాతలకు అందుబాటులో ఉండే రెమ్యూనరేషన్ తీసుకోవడంతో కార్తీ ఇన్ని సినిమాలు లైన్లో పెట్టగలిగారని తమిళ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. జపాన్ సినిమా ఫ్లాప్ తర్వాత.. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న సినిమాపై కార్తీ భారీ అంచనాలు పెట్టుకున్నారని వారు చెబుతున్నారు.