Rashmi Gautam: బుల్లితెర మీద యాంకర్ గా సందడి చేస్తూ ఎప్పుడు జనాలను అలరిస్తూ వాళ్ల హృదయాల్లో చోటు సంపాదించుకున్న యాంకర్ ‘రేష్మి గౌతమ్’…ముఖ్యంగా జబర్దస్తీ షో లో సుడిగాలి సుధీర్ రేష్మి ప్రేమించుకుంటున్నారు అంటూ వచ్చిన గాసిప్ లతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక రేష్మి షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతి చిన్న విషయం మీద ఆమె స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.
ముఖ్యంగా మూగజీవాలకి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం తను చాలా ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆమె రియాక్ట్ అవ్వడం మనం చూసాము.. అయితే అలాంటి రేష్మి ప్రస్తుతం చాలా బాధతో ఉన్నారని తెలుస్తుంది. ఆమె అలా ఉండటానికి కారణం ఏంటంటే రీసెంట్ గా తనదగ్గర ఉన్న ఒక కుక్క ఫిబ్రవరి 9వ తేదీన చనిపోయింది. దాని వల్ల ఆమె తీవ్రమైన మనోవేదనకు గురవుతుంది. నిజానికి కుక్క చనిపోతే అంతలా బాధపడడం ఏంటి అనే డౌట్ మనలో అందరికీ రావచ్చు.
కానీ తను ఎప్పుడూ దానిని కుక్కలా చూడలేదు. ఆ కుక్క కి ‘చుట్కి గౌతమ్’ అని తనలో ఉన్న సగం పేరుని తన కుక్కకి పెట్టుకుంది. ఇక దీన్ని బట్టి తనకి ఆ కుక్క అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి చుట్కి గౌతమ్ చాలా రోజుల నుంచి అనారోగ్యానికి గురైంది. దాన్ని బతికించుకోవాలని రేష్మి చాలా రకాల ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఫలితం దక్కలేదు ఫైనల్ గా చుట్కి చనిపోయింది. ఇక దానికి హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలను పూర్తి చేసిన రేష్మి అస్థికలని కూడా సేకరించింది. ఇక ఇప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోలను చూసిన హీరోయిన్ ప్రియమణి చుట్కి కి శాంతి కలగాలంటూ తన సంతాపాన్ని తెలియజేస్తూ ఒక కామెంట్ అయితే చేశారు…
ఇక దీంతో రేష్మి ఫ్యాన్స్ కూడా కొంతవరకు బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రేష్మి అటు టీవీలో యాంకర్ గా చేస్తూనే కొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. ఇక ఇప్పటికే గుంటూరు టాకీస్, ఆర్గానిక్ అల్లుడు హైబ్రిడ్ మామ,భోళా శంకర్ లాంటి కొన్ని సినిమాల్లో నటించి నటిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది…