Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం ‘స్పిరిట్'(Spirit Movie), ‘కల్కి 2′(Kalki 2 Movie), ‘Fauji’ చిత్రాలను పూర్తి చేయడం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ముందుగా ఆయన ‘Fauji’ మూవీని పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడు. గత వారం రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా, ప్రస్తుతం యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడం లో బిజీగా ఉన్నారు మేకర్స్. వంద రోజుల పాటు ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని దసరా కి విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక, డెహ్రాడూన్ లో ‘స్పిరిట్’ రెండవ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు ప్రభాస్. 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఇక ఆ తర్వాత ఒక ‘కల్కి 2’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యింది.
కొన్ని ప్రదేశాల్లో భారీ సెట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. త్వరలో మొదలయ్యే షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొనబోతున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ తో చెయ్యబోయే చిత్రం కూడా ఉంది. బకాసురుడి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇందులో ప్రభాస్ బకాసురుడి పాత్రలో కనిపిస్తాడట. ఈ ప్రాజెక్ట్ ని KGF , సలార్ వంటి చిత్రాలను నిర్మించిన హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించాలని అనుకుంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి ఆ సంస్థ తప్పుకున్నట్లు తెలిసింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో ఎందుకో కొన్ని టర్మ్స్ కుదరడం లేదట.అందుకే వాళ్ళు ఆయన తో సినిమా చేయడానికి సిద్ధం గా లేరని సమాచారం.
పైన చెప్పిన మూడు ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యాక ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమాకే డేట్స్ ని కేటాయించాడు. భాగ్య శ్రీ భోర్సే ని హీరోయిన్ గా కూడా ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ లేనట్టే, ప్రభాస్ తన డేట్స్ మొత్తాన్ని KVN ప్రొడక్షన్స్ కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒక భారీ సినిమాని ఈ ప్రొడక్షన్ లో చేయబోతున్నాడు, ముగ్గురు టాప్ డైరెక్టర్స్ కూడా లైన్ లో ఉన్నారు. ఎవరు ఈ చిత్రాన్ని చేయబోతున్నారు అనేది పాతుతానికి సస్పెన్స్. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశాంత్ వర్మ మూవీ పై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రభాస్ ని అప్పటి వరకు ఎవ్వరూ చూడని పాత్ర, చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడు, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అని చాలా లెక్కలు వేకున్నారు, కానీ ఇప్పుడు ఈ సినిమానే రద్దు అవ్వడం వాళ్ళను కాస్త నిరాశకు గురి చేసింది.