Rajamouli And Uday Kiran: చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో వరుస విజయాలను అందుకున్న నటుడు ఉదయ్ కిరణ్… ఆ తర్వాత ఆయన స్టార్ హీరోగా మారతాడని అందరు అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల అతను పర్సనల్ విషయాల్లో తీసుకున్న డిసిజన్స్ వల్ల చాలా వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తను సినిమా మార్కెట్ ని కోల్పోవడమే కాకుండా ఫైనల్ గా తను ఈ భూమి మీదే లేకుండా వెళ్లిపోయాడు. ఇక ఉదయ్ కిరణ్ వి ఎన్ ఆదిత్య డైరెక్షన్ లో చేసిన మనసంతా నువ్వే సినిమాను రీసెంట్గా రీ రిలీజ్ చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అయితే లభించింది. అయితే ఉదయ్ కిరణ్ కెరియర్ మొదట్లో నటుడిగా రాణిస్తున్న సమయంలో చాలా మంది దర్శకులు అతనితో సినిమా చేయాలని అనుకున్నారు.
అందులో రాజమౌళి కూడా ఒకరు కావడం విశేషం… రాజమౌళి నితిన్ తో చేసిన ‘సై’ సినిమాని మొదట ఉదయ్ కిరణ్ తోనే చేయాలని అనుకున్నాడట. కానీ అనుకోని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. ఇక దాంతో పాటుగా మరో సినిమాని కూడా ఉదయ్ కిరణ్ తో చేస్తే బాగుంటుందని రాజమౌళి భావించినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు.
ఇక ఏది ఏమైనా కూడా దర్శక ధీరుడిగా పేరు సంపాదించుకున్న రాజమౌళి ఉదయ్ కిరణ్ తో సినిమా చేస్తే ఆయన దశ మారిపోయేదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. తేజ, వి ఎన్ ఆదిత్య లాంటి దర్శకులు తనతో వరుస సినిమాలు చేసినప్పటికి అవి ఆయనకు ఆశించిన మేరకైతే సక్సెస్ ను సాధించి పెట్టలేదు…
దాంతో ఆయన చాలా రోజుల వరకు ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఉదయ్ కిరణ్ లాంటి నటుడు ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేశాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అలాంటి ఉదయ్ కిరణ్ మరణ వార్తను విని చాలామంది జీర్ణించుకోలేకపోయారు…