https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి కి యోగి సినిమాకి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే.?

బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో 300 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా, ఇండస్ట్రీలో తన పేరుకి ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 10, 2024 / 05:39 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న చిరంజీవి దాదాపు 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా ఒక పెను సంచలనాన్ని సృష్టిస్తుంది. ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ సినిమాతో 100 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాడు.

    ఇక బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో 300 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా, ఇండస్ట్రీలో తన పేరుకి ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు విశ్వంభర సినిమాతో ఒక పెను సంచలనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే చిరంజీవికి వివి వినాయక్ ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించాడు. అయితే ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ లు కావడం విశేషం…అయితే వినాయక్ చిరంజీవితో ఠాగూర్ సినిమా చేసి సక్సెస్ సాధించిన తర్వాత కొద్దిరోజులకి వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా చేయాలని చిరంజీవి అనుకున్నాడు.

    ఇక అందులో భాగంగానే వినాయక్ ను పిలిచి చిరంజీవి ఒక మంచి కథ చెప్పమని అడగగా వినాయక్ ‘యోగి ‘ సినిమా కథను చిరంజీవి కి చెప్పాడట. అయితే ఆ స్టోరీ మొత్తం విన్న చిరంజీవి అంత బాగానే ఉంది కానీ క్లైమాక్స్ మాత్రం అంత ఎఫెక్టివ్ గా లేదు అంటూ చిరంజీవి క్లైమాక్స్ లో కొన్ని మార్పులు చేయమన్నారంట. కానీ ఆ మార్పులకు ఇష్టపడని వినాయక్ చిరంజీవిని కాదని ప్రభాస్ తో ఈ సినిమాని చేశాడు. అయితే చిరంజీవి ఏ మార్పులు అయితే చెప్పాడో ఆ మార్పులు చేయకపోవడం వల్లే యోగి సినిమా ఫ్లాప్ అయినట్టుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత వినాయక్ గమనించడట.

    ఇక ఆ తప్పులు చేసిన వినాయక్ మరోసారి చిరంజీవిని కలిసినప్పుడు చిరంజీవికి సారీ చెప్పాడంట. ఎందుకంటే తను చెప్పిన చేంజెస్ చేయకపోవడం వల్లే యోగి సినిమా ఫ్లాప్ అయిందంటూ చిరంజీవితో వినాయక్ చెప్పడం విశేషం… ఇక చిరంజీవి ఒక స్టోరీ వినగానే దాంట్లో ఉన్న ప్లస్ లు, మైనస్ లు ఈజీగా గమనించి ఏ సీను ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. ఏది కనెక్ట్ అవదు అనేది కూడా ఈజీగా చెప్పేస్తారు. అందువల్లే ఆయన మెగాస్టార్ చిరంజీవిగా ఇన్ని సంవత్సరాల పాటు గుర్తింపు పొందుతున్నాడు అంటూ మరి కొంతమంది ఆయన గురించి చాలా గొప్ప చెబుతూ ఉంటారు…