Homeఎంటర్టైన్మెంట్Top Heroes rejected Harish Shankar: హరీష్ శంకర్ కి ఆ ఇద్దరు టాప్ హీరోలు...

Top Heroes rejected Harish Shankar: హరీష్ శంకర్ కి ఆ ఇద్దరు టాప్ హీరోలు హ్యాండ్ ఇచ్చారుగా…

Top Heroes rejected Harish Shankar: కమర్షియల్ సినిమాలను తీయడం అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. ఇప్పటివరకు ఎన్నో వందల వేల కమర్షియల్ సినిమాలు వచ్చాయి. వాటన్నింటిని కాదని మనం గొప్పగా ఏం చెబుతున్నావ్ ప్రేక్షకుడు దానిని ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనే విషయాలన్నింటిని ముందే క్యాలిక్యులేట్ చేసుకొని రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇక కమర్షియల్ సినిమాలను చాలా బాగా తెరకెక్కించగలిగే అతి కొద్ది మంది దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు…గతంలో ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి హరీష్ శంకర్ మార్క్ ఈ సినిమాలో కనిపించింది. ఇక పవన్ కళ్యాణ్ ని భారీగా ఎలివేట్ చేస్తు ఆయన రాసిన సన్నివేశాలు సైతం ప్రేక్షకులను విశేషంగా ఆలోచించాయి. ఇక అలాంటి హరీష్ శంకర్ ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేయడంలో మాత్రం తడబడ్డాడనే చెప్పాలి. గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ హరీష్ శంకర్ ఇంతకుముందు రవితేజతో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఫ్లాప్ అయింది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు చిరంజీవి, బాలయ్య ఇద్దరు సైతం హరీష్ శంకర్ కి హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక హరీష్ శంకర్ కి ఇప్పుడు డేట్స్ ఇచ్చే హీరోలు ఎవరు ఉన్నారు? ఎవరితో ఆయన సినిమా చేస్తే సక్సెస్ ని సాధిస్తాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఎప్పటికైనా స్టార్ హీరోలందరు స్టార్ డైరెక్టర్ల వెంటే పడుతున్నారు. ఇక హరీష్ శంకర్ కి డేట్స్ ఇవ్వాలంటే మీడియం రేంజ్ హీరోలు అయితేనే డేట్స్ ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అంతే తప్ప స్టార్ హీరోలైతే ఇప్పుడు అతనికి డేట్స్ ఇచ్చే అవకాశాలు మొత్తానికే లేవు. ఎందుకంటే వాళ్ళందరి విషయంలో ఒకరిని మించిన కథలతో మరొకరు వస్తున్నారు.

ఒకరిని మించిన మేకింగ్ స్టైల్ తో ఇంకొకరు మెప్పిస్తున్నారు. కాబట్టి వాళ్లందర్నీ దాటుకుని హరీష్ శంకర్ కి డేట్స్ ఇవ్వడం చాలా కష్టం… కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే తన మీడియం రేంజ్ హీరోలతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధించాలి. లేదంటే మాత్రం ఆయన ఔట్ డేటెడ్ డైరెక్టర్ గా మిగిలిపోయే అవకాశాలైతే ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Haripriya Vasishta N Simha

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...
Quality Content In Cinema

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...
Adarsha Kutumbam

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...
Zomato Anniversary Campaign

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...
Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: ఒక్క డిన్నర్.. ఈ క్రికెటర్ జీవితాన్ని ఎలా మార్చిందంటే..

Yashasvi Jaiswal: ఇప్పుడు మనం సోషల్ మీడియా కాలంలో ఉన్నాం. ఏదైనా జరిగితే చాలు.. దానికి తగ్గట్టుగా కథలు అల్లడం.. దానిని వ్యాప్తిలోకి తీసుకురావడం అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా కాలంలో నిజాలకు విలువలేదు....
Oktelugu Epaper