Homeఎంటర్టైన్మెంట్Hari Hara Veera Mallu vs Kingdom: ఒకేరోజు విడుదల కాబోతున్న 'హరి హర వీరమల్లు',...

Hari Hara Veera Mallu vs Kingdom: ఒకేరోజు విడుదల కాబోతున్న ‘హరి హర వీరమల్లు’, ‘కింగ్డమ్’..ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్!

Hari Hara Veera Mallu vs Kingdom: షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 12కు విడుదలకు సిద్దమైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం చివరి నిమిషం లో వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడిన క్షణం నుండి ఇప్పటి వరకు మేకర్స్ కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టి వాయిదా పడింది అని చెప్పలేదు. మీడియా కి చిన్న ప్రెస్ నోట్ ని వదిలారంతే. అది కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. దీంతో అత్యధిక శాతం మంది అభిమానులు ఈ సినిమా జూన్ 12నే విడుదల అవుతుందని అనుకున్నారు. అనేక చోట్ల థియేటర్స్ బయట అభిమానులు బ్యానర్లు, కటౌట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. చివరికి వాయిదా పడింది అని తెలుసుకొని బాధ పడ్డారు. కొత్త విడుదల తేదీ పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థ తో గత రెండు రోజులుగా విడుదల తేదీ విషయం లో చర్చలు జరుగుతున్నాయి.

Also Read: Hari Hara Veeramallu Movie : హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఖరారు..ఎవరో ఊహించగలరా?

నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని జులై 18 న విడుదల చేయాలని అనుకుంటున్నాడు. కానీ అమెజాన్ ప్రైమ్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు, ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని జులై 25 నే విడుదల చేయాలని పట్టుబడుతోంది, లేకపోతే పది నుండి 20 కోట్ల రూపాయిల వరకు కట్ చేస్తామని హెచ్చరించారట. మరోపక్క విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రానికి కూడా నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ మరో అవకాశం ఇవ్వడం లేదు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం జులై 25 న విడుదల అవుతుంది కాబట్టి, ‘కింగ్డమ్’ చిత్రాన్ని ఆగష్టు 1న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ కి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒప్పుకోవడం లేదు. జులై 25 నే రావాలని చెప్తున్నారట. దీంతో ఈ రెండు సినిమాలకు ప్రస్తుతానికి అయితే ఒకే రోజున విడుదలై క్లాష్ ని ఎదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: Vijay Devarakonda Kingdom Movie: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సెకండ్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా..? ఇలా అయితే కష్టమే!

‘హరి హర వీరమల్లు’ చిత్రానికి పెట్టిన ఖర్చుకు, జరిగిన బిజినెస్ కి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రెండు వారాల ఫ్రీ గ్రౌండ్ కావాలి. కానీ ఇక్కడ టైట్ గా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి నిర్మాత రత్నం ఏమి చేయబోతున్నాడు?, అమెజాన్ ప్రైమ్ చెప్పినట్లుగా జులై 25 న ఈ చిత్రం వస్తుందా?, లేకపోతే జులై 18 న విడుదలై 10 నుండి 20 కోట్ల రూపాయిలు బొక్క పెట్టుకోబోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటన కోసం అభిమానులు మాత్రమే కాదు, ట్రేడ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ సినిమా తేదీని ప్రకటిస్తేనే మిగిలిన తేదీలకు సంబంధించిన సినిమాలు వస్తాయి. లేదంటే అన్నీ చిత్రాలు రిస్క్ లో పడినట్టే. ఈ వారం లోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper