Hari Hara Veeramallu Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం వచ్చే నెల 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 21 న ఆ చిత్ర నిర్మాత AM రత్నం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన సినిమా గురించి అనేక విశేషాలను పంచుకోవడమే కాకుండా, ప్రొమోషన్స్ ఎలా ప్లాన్ చేసారు అనే దానిపై కూడా కీలక ప్రకటనలు చేయబోతున్నాడు. అదే రోజున ఈ సినిమాకు సంబంధించిన మూడవ పాటని కూడా విడుదల చేయబోతున్నారట. సినిమాలో వచ్చే ఒక కీలక యుద్ధ సమయం లో పవన్ కళ్యాణ్ మొఘల్ సామ్రాజ్యం తో యుద్ధం చేసే సమయం లో వచ్చే పాట అట ఇది.
Also Read : విశ్వంభర సినిమా లేట్ అవ్వడానికి కారణం ఆ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ సరిగ్గా రాకపోవడమేనా..?
ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక నుండి జరగబోయేది మరో లెక్క, ఈ పాట తర్వాత అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంటాయని, కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాం అనే ఫీలింగ్ అభిమానులకు కలుగుతుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కనీవినీ ఎరుగని రీతిలో పవన్ కళ్యాణ్ అభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ప్లాన్ చేయబోతున్నారట. అది హైదరాబాద్ లో జరుగుతుందా లేకపోతే ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతుందా అనేది ఇప్పుడే తెలియదు కానీ, ఈ ఈవెంట్ కి ఒక స్పెషల్ అతిథి రాబోతున్నాడు అనేది తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. సాధారణంగా ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి పెద్ద వాళ్ళు వస్తుంటారు. పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కంటే పెద్ద వాళ్ళు ఈ రెండు తెలుగురాష్ట్రాల్లో ఎవరుంటారు చెప్పండి?.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళే పవన్ కళ్యాణ్ కంటే పెద్ద స్థానం లో ఉన్నవారు. కానీ వీళ్లిద్దరు కూడా ముఖ్య అతిధులు కారు, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథి. అన్నయ్య ని పవన్ కళ్యాణ్ ఎంతలా గౌరవిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున దేశం లో ఉన్న ముఖ్య నాయకుల ముందు చిరంజీవి కాళ్లకు నమస్కరించిన ఘటన ని అభిమానులు అంత తేలికగా మర్చిపోగలరా..?, తానూ ఎంత ఎదిగిన అన్నయ్య ముందు ఎప్పటికీ చిన్నవాడినే అనే సంకేతం పవన్ కళ్యాణ్ అందరికీ అందించాడు. తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన సినిమా కావడంతో ఈ ఈవెంట్ కి అన్నయ్య ని ముఖ్య అతిథిగా పిలవాలని పవన్ కళ్యాణ్ నిర్మాతతో అన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 21న జరగబోయే ప్రెస్ మీట్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా నిర్మాత స్పందించే అవకాశం ఉంటుంది.