Nikesh Arora unique journey: నేటి కాలంలో ఒక ఇంటర్వ్యూలో విఫలమైతేనే చాలామంది నిరాశ పడుతుంటారు. పదులకొద్దీ ఇంటర్వ్యూలను ఎదుర్కొని అందులో విఫలమైతే జీవితం ముగిసిపోయిందని భావిస్తుంటారు. కానీ ఇతడు ఒకటి కాదు రెండు కాదు, 100 కాదు, 200 కాదు.. ఏకంగా 400 ముఖాముఖిలకు హాజరయ్యాడు. 400 సార్లు కూడా రిజెక్ట్ అయ్యాడు. అయినప్పటికీ అతడు ఏమాత్రం నిరాశ చెందలేదు. ఆశావాహ దృక్పథాన్ని కోల్పోలేదు. ఎందుకు ఈ జీవితం అని బాధపడలేదు. తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. తనలో తానే మదనపడ్డాడు. చివరికి ఓ కార్పొరేట్ కంపెనీకి సీఈవో అయ్యాడు. ఆ కంపెనీ ముఖ విలువ ఇప్పుడు ఏకంగా 130 బిలియన్ డాలర్లు.
సాంకేతిక ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ సంస్థలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. అలాంటి సైబర్ సెక్యూరిటీ సంస్థలలో ఆరోరా పని చేస్తున్న కంపెనీకి ఘనమైన చరిత్ర ఉంది. ఈ కంపెనీకి సీఈవోగా నికేష్ అరోరా కొనసాగుతున్నారు. ఈ కంపెనీ ముఖ విలువ దాదాపు 130 బిలియన్ డాలర్లు. అయితే అరోరా గతంలో 400 సార్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అన్ని సందర్భాలలో కూడా ఆయన రిజెక్ట్ అయ్యారు. అయినప్పటికీ నిరుత్సాహాన్ని తన దరికి రానివ్వలేదు. ఆశావాదాన్ని దూరం చేసుకోలేదు. ఇప్పుడు ఏకంగా 130 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ ఉన్న కంపెనీకి ఆయన సీఈవో అయ్యారు. అయితే తనకు వచ్చిన 400 రిజెక్షన్ లెటర్లను ఆయనను తన వద్ద ఉంచుకున్నారు. అరోరా ఐఐటి భువనేశ్వర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే పూర్తిగా ఉపకార వేతనంతోనే ఆయన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.
” నేను ఐఐటీ భువనేశ్వర్ లో చదివాను. వాస్తవానికి ఐఐటీలో చదివిన వారికి విపరీతమైన విలువ ఉంటుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. నా వరకు వచ్చేసరికి అది పూర్తి విరుద్ధంగా మారింది. ఉద్యోగాల కోసం చాలా కంపెనీలు తిరిగాను. అన్నిచోట్ల కూడా నాకు తిరస్కారం ఎదురైంది. చివరికి పాలో ఓ సైబర్ సెక్యూరిటీ అనే కంపెనీలో ఉద్యోగం లభించింది. ఇందులో సిఈఓ స్థాయికి ఎదిగాను. ఈ కంపెనీ ముఖ విలువ ఇప్పుడు 130 బిలియన్ డాలర్లు. ఒకప్పుడు ఉద్యోగం కోసం వెళ్లిన నేను ఇవాళ ఉద్యోగులకు అధిపతిగా ఉన్నాను. అందువల్ల జీవితంలో ఎప్పుడు కూడా నిరాశావాదాన్ని దరి చేరనివ్వకండి. మీ సొంత సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి.. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని ఇతరులతో ఏమాత్రం పోల్చుకోకండి.. మీకు మీరే నాయకుడిలాగా ఎదగండి. నాయకత్వ లక్షణాలను అలపర్చుకోండి. అప్పుడు మీ జీవితం పూలపాన్పు అవుతుందని” అరోరా చెబుతున్నాడు.