Hari Hara Veera Mallu Trailer: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులను ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) టీం పెట్టినంత హింసలు ఏ నిర్మాణ సంస్థ కూడా పెట్టి ఉండదు. మొట్టమొదటి సారి అభిమానులు ఒక సినిమా విడుదల తేదీని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు ఈ చిత్రం వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ చిత్రం జులై 24 న విడుదల కాబోతుందని రీసెంట్ గానే అధికారిక ప్రకటన చేశారు. ఈసారి గురి తప్పే సమస్యే లేదంటూ తేల్చి చెప్పారు. ఈ వారం లోనే థియేట్రికల్ ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుందని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చప్పుడు చేయకపోవడం తో అభిమానుల సహనం నశించి సోషల్ మీడియా లో నిర్మాతలను తిట్టడం మొదలు పెట్టారు. ఈ నిరసన సెగ వాళ్లకు బాగా తగిలింది అనుకుంట, వెంటనే మూవీ టీం నుండి రెస్పాన్స్ వచ్చింది.
కాసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ కట్ ని ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ కి నిర్మాత AM రత్నం చూపించాడట. ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ ట్రైలర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసేసారు. జులై 3వ తేదీన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా సాధారణమైన రిలీజ్ కాదు, థియేటర్స్ లో భారీగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే 40 కి పైగా థియేటర్స్ ని ఎంపిక చేసారు. పూర్తి స్థాయి థియేటర్స్ లిస్ట్ అతి త్వరలోనే సిద్ధం చేయబోతున్నారు. ఈ ట్రైలర్ విడుదలకు సంబంధించిన ప్రకటన నేడు సాయంత్రం,లేదు రేపు ఉదయం వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో థియేటర్స్ ఖరారు అయ్యాక ఈ ప్రకటన చేస్తారని అంటున్నారు. అభిమానులతో పాటు, ట్రేడ్ కూడా ఈ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది.
ఈ ట్రైలర్ తర్వాత సినిమా రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్తుందని నిర్మాత బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడట. ‘హరి హర వీరమల్లు’ నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం మూడేళ్ళ క్రితం వచ్చినవి. ఇక రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం లోని పాటలకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కారణం ఇలాంటి జానర్ చిత్రాల్లో పాటలు పెద్దగా క్లిక్ అవ్వవు. బాహుబలి సిరీస్ కి కూడా విడుదలకు ముందు ఇలాగే జరిగింది. నిర్మాత AM రత్నం ప్రతీ సెంటర్ లోనూ ఈ చిత్రానికి పుష్ప 2 రేంజ్ బిజినెస్ ని ఆశిస్తున్నాడు. ఆ రేంజ్ జరగాలంటే కచ్చితంగా ట్రైలర్ ని చూసి అందరూ షాక్ కి గురి అవ్వాలి. ఆ రేంజ్ లోనే ట్రైలర్ ని ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వచ్చే వారం గురువారం వరకు ఎదురు చూడాల్సిందే.