Vijay Devarakonda Kingdom Movie: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ముఖ్యంగా అమ్మాయిలలో ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ జనరేషన్ అమ్మాయిలు మొత్తం ఈయన ఫ్యాన్స్ అయ్యుండొచ్చు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఆ ఫాలోయింగ్ ఇతన్ని చాలా బాగా కాపాడుతుంది. ‘టాక్సీ వాలా’ చిత్రం తర్వాత ఈ హీరో నుండి విడుదలైన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. గత చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’ ఎలాంటి డిజాస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలి, కుంభస్థలం బద్దలు అవ్వాలి అనే కసితో ఆయన నటించిన చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie). జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, భాగ్యశ్రీ భొర్సే హీరోయిన్ గా నటించింది.
గత నెల 31వ తారీఖున ఈ చిత్రం విడుదల అవ్వాల్సి ఉంది. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో జులై 4 కి వాయిదా వేశారు. సెకండ్ హాఫ్ లో అనేక సన్నివేశాలను రీ షూట్ చేస్తూ కూర్చున్నారు ప్రస్తుతం. రీసెంట్ గానే ఫైనల్ కాపీ రీ రికార్డింగ్ లేకుండా రెడీ అయ్యిందట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా వచ్చిందని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా డౌన్ అయ్యిందని. విజయ్ దేవరకొండ అనేక భావోద్వేగ పూరిత సన్నివేశాల్లో సరైన ఎమోషన్స్ పలికించలేకపోయాడని, సినిమా ఎదో ఉంది అంటే ఉంది అన్నట్టుగా ఉందని ఒక టాక్ లీక్ అయ్యింది. కానీ సినిమా వచ్చేంత వరకు ఇలాంటివి అసలు నమ్మలేం అంటూ సోషల్ మీడియా లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంటున్నారు. కచ్చితంగా ఈ చిత్రం మా హీరో కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని బలమైన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Allu Arjun and Vijay : అల్లు అర్జున్,విజయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా? డైరెక్టర్ ఎవరంటే!
ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్రాన్ని జులై 25న, లేదా ఆగష్టు మొదటి వారం లో ఈ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ముందుగా జులై నాల్గవ తేదీన వచ్చే నితిన్ తమ్ముడు చిత్రాన్ని వాయిదా వేయించి, కింగ్డమ్ చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పుడు కింగ్డమ్ ఆ తేదీన రాకపోతుండడంతో తమ్ముడు చిత్రాన్ని మళ్ళీ జులై నాల్గవ తేదికి మార్చారు. ‘హరి హర వీరమల్లు’ తర్వాత ఈ ఏడాది అత్యధిక సార్లు వాయిదా పడిన చిత్రమిదే. అయితే సోషల్ మీడియా లో లీకైన సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ ని చూస్తుంటే విజయ్ దేవరకొండ మరో సూపర్ హిట్ ని అందుకోవడం ఇప్పట్లో కష్టమేనా అని అనిపిస్తుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.