Kingdom teaser release : అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం ఎట్టకేలకు ఫైనల్ విడుదల తేదీని లాక్ చేసుకుంది. ఈ నెల 31 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రకటన ని ఒక యాక్షన్ టీజర్ ద్వారా విడుదల చేశారు. ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ‘రగిలే..రగిలే..మొదలయ్యే యుద్ధాలే..కదిలే..కదిలే..పదునెక్కే ఖడ్గాలే’ అంటూ సాగే పాట వినగానే ఆడియన్స్ కి అద్భుతంగా కనెక్ట్ అయిపోయింది. అనిరుద్(Anirudh Ravichander) మార్క్ మ్యూజిక్ అంటే ఏంటో మరోసారి ఈ పాట ద్వారా రుజువు చేసి చూపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక సాంగ్ విడుదలై యావరేజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
కానీ నేడు విడుదల చేసిన ప్రోమో లోని సాంగ్ మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. దీనిని వెంటనే విడుదల చెయ్యమని అంటున్నారు నెటిజెన్స్. ఈ సినిమా విడుదలకు కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ మూడు వారాల్లో ఈ సినిమాకు సంబంధించిన పాటలతో పాటు, ప్రొమోషన్స్ మరియు ఇతర కార్యక్రమాలను కూడా చెయ్యాల్సి ఉంది. మరి నాగవంశీ ఎంత వరకు మ్యానేజ్ చేయగలడో చూడాలి. కనీసం ఈ డేట్ కి అయినా వస్తుందా?, లేకపోతే ఇంతకు ముందు లాగానే డేట్ చెప్పి వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రానికి, ఈ సినిమాకు తేడా కేవలం వారం రోజుల గ్యాప్ మాత్రమే. మరి పవన్ కళ్యాణ్ సినిమాకు వారం రోజుల గ్యాప్ లో ఒక మీడియం రేంజ్ హీరో సినిమాని వెయ్యాలని అనుకోవడం పెద్ద సాహసమే.
పైగా ఈ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ కూడా వారం రోజుల గ్యాప్ లో వేసేస్తున్నాడు. వాస్తవానికి వేరే గత్యంతరం లేకనే ఆ తేదీన విడుదల చేస్తున్నట్టు చెప్తున్నారు. నెట్ ఫ్లిక్స్ తో కుదిరించుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ జులై నెలలోనే విడుదల చెయ్యాలట. ఈ జులై నెల దాటి మరో తేదికి వెళ్లాలని అనుకుంటే మాత్రం భారీ స్థాయిలో జరిమానా కట్టాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారట. అందుకే జులై 31 న విడుదల చెయ్యాల్సి వస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో నాగవంశీ మాటల్లోనే చూడాలి. ఎందుకంటే ఈయన ఇచ్చే ఇంటర్వ్యూస్ లో మొహమాటం లేకుండా జరిగింది జరిగినట్టు చెప్తుంటాడు. చూడాలి మరి ఈ ఆసక్తికరమైన పోరులో ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది.