Hari Hara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం ఎట్టకేలకు జులై 24 న విడుదల కాబోతున్నట్టు కాసేపటి క్రితమే ఆ చిత్ర మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు. ఇలా కొత్త విడుదల తేదీలతో పోస్టర్లు కొట్టడమే కానీ , కనీసం ఈసారైనా చెప్పిన డేట్ కి సినిమా వస్తుందా అని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా లో సెటైర్స్ వేస్తున్నారు. వాళ్ళు అలా భయపడడం లో కూడా అర్థం ఉంది. మరో 9 రోజుల్లో సినిమా విడుదల ఉంటుంది అని అనుకుంటున్న సమయం లో రాత్రికి రాత్రి విడుదల తేదీని మార్చేశారు. మేకర్స్ ఇచ్చిన ఆ మాస్టర్ స్ట్రోక్ నుండి అభిమానులు ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు కొత్త విడుదల తేదీని కూడా వాళ్ళు నమ్మకపోవడానికి కారణం ఇదే.
Also Read: సందీప్ వంగ,అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా..? ఇద్దరి మధ్య గొడవ ఎక్కడ మొదలైందంటే!
కానీ ఈసారి మాత్రం అన్నీ సిద్ధం చేసుకున్నారు కాబట్టి వాయిదా పడే అవకాశాలు ఈసారి కచ్చితంగా ఉండవని బలమైన నమ్మకం తో చెప్తున్నాయి ఈ సినిమాకు సంబంధించిన సన్నిహిత వర్గాలు. అంతకు ముందుతో పోలిస్తే ఈసారి ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయని, హైప్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది అభిమానులు కంగారు పడాల్సిన అవసరమే లేదంటూ చెప్పుకొస్తున్నారు. నిన్న రాత్రి కూడా ఇక నుండి ప్రతీ రోజు యాక్టీవ్ గా ఉంటూ ప్రొమోషన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. మరి నిజంగా యాక్టీవ్ గా ఉంటారా లేదా అనేది చూడాలి. నిర్మాత AM రత్నం ఈ సినిమాపై కోటి ఆశలు పెట్టుకున్నాడు. నేటి తరం యువత ఆలోచనలకూ ఈ చిత్ర నిర్మాత చాలా దూరం. అందుకే ప్రొమోషన్స్ విషయం లో బాగా వెనుకబడ్డాడు. కానీ ఇక నుండి మాత్రం ప్రొమోషన్స్ కోసం సరికొత్త టీం ని హైర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి కనీసం వీళ్ళు అయినా సరిగా ప్రమోట్ చేస్తారా లేదా అనేది.
Also Read: గంటకు 20 వేల టిక్కెట్లు..నాగార్జున, ధనుష్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ లోడింగ్!
సినిమా విడుదలకు నెల రోజులకు పైగా సమయం ఉంది. ఈ నెల రోజుల్లో సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ఎంతో గొప్పగా జనాల్లోకి తీసుకెళ్లొచ్చు. అనేక ఈవెంట్స్ చేయొచ్చు. ప్రస్తుతానికి అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. జులై 5 న థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ఈ ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. గతం లో వకీల్ సాబ్ సినిమాకు ఇదే విధంగా హైప్ వచ్చింది. అప్పట్లో థియేటర్స్ లో ఈ ట్రైలర్ ని ప్రదర్శించగా దానికి వచ్చిన రెస్పాన్స్ ని చూసి ఇండియా మొత్తం షేక్ అయ్యింది. అలాంటి ఫీట్ ‘హరి హర వీరమల్లు’ తో రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
One fights for Power.
One fights for Dharma.
The clash of legacies begins.Witness the Battle for truth, faith and freedom , ⚔️
A Historic Experience Awaits ❤️#HariHaraVeeraMallu #HHVMonJuly24th #HHVM… pic.twitter.com/WHLUZWtavA
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 21, 2025